తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎండ్రియాల్ గ్రామానికి చెందిన తా టిపాముల బాలాగౌడ్ (53)ప్రమా దవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. బాలాగౌడ్ రోజూ మాదిరిగానే శనివారం పశువులను తీసుకొని తన వ్యవసాయ పొలం వైపు వెళుతుండగా గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ప్రమాదవశాత్తు కాలు జారీ రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలాగౌడ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య మంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, బాలాగౌడ్ మంచి గాయకుడని, భజనలలో చురుకుగా పాల్గొనేవాడని గ్రామస్తులు తెలిపారు.
ప్రమాదవశాత్తు ఒకరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
నవీపేట: మండల శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పోతంగల్ గ్రామానికి చెందిన మావూరి లక్ష్మి (60) మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలిపారు. నవీపేటలో శుక్రవారం వారాంతపు సంతకు వచ్చిన లక్ష్మి తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ఆటో ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మిని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి కుమారుడు మావూరి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.