నిత్యనూతనం బాలరాజ్‌ పాఠాలు | - | Sakshi
Sakshi News home page

నిత్యనూతనం బాలరాజ్‌ పాఠాలు

Sep 5 2026 7:01 AM | Updated on Sep 5 2026 7:01 AM

రుద్రూర్‌ : విద్యార్థులకు క్లిష్టమైన విషయాలను సైతం ఎంతో సులభంగా, ఆసక్తికరంగా బోధిస్తూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు నూతిపల్లి బాలరాజ్‌. రుద్రూర్‌కు చెందిన బాలరాజ్‌.. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. ఆయన ఇప్పటికే రెండుసార్లు మండల స్థాయి, ఒకసారి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారాలు అందుకున్నారు. ఆధునిక సాంకేతికతను జోడించి యూట్యూబ్‌ ద్వారా పాఠ్యాంశాలను డిజిటల్‌ రూపంలో విద్యార్థులకు చేరువ చేస్తున్నారు. యూట్యూబ్‌లో సుమారు 21 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆయన అప్‌లోడ్‌ చేసే వీడియోలకు విశేష ఆదరణ లభిస్తోంది. కరోనా సమయంలో విద్యార్థులు చదువు దూరం కాకుండా రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో వర్క్‌షీట్లను రూపొందించారు. ఈయన తయారు చేసిన పాఠ్యాంశాల వీడియోలు ’టీ శాట్‌’ లో ప్రసారమయ్యాయి. ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన క ల్పిస్తున్నారు. 2024 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో స్వయంగా రాజ్యాంగ ప్రతిని తయారు చేయించగా, ఈ ప్రతిభను గుర్తించిన ఎస్‌సీఈఆర్టీ తన వార్షిక మ్యాగజైన్‌లో ప్రత్యేకంగా ప్రచురించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement