బోధనలో అపార అనుభవం | - | Sakshi
Sakshi News home page

బోధనలో అపార అనుభవం

Sep 5 2026 7:01 AM | Updated on Sep 5 2026 7:01 AM

తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై న తెయూ తెలుగు అధ్యయన శాఖ ప్రొఫెసర్‌ లావణ్య డిగ్రీ కాలేజ్‌తో పాటు వర్సిటీ ప్రారంభమైన 2006 నుంచి 29 సంవత్సరాలుగా అపారమైన బోధనానుభవం గడించింది. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమి మెంబర్‌గా రాష్ట్రం నుంచి ఎన్నుకోబడి, ప్రతిష్ఠాత్మకమైన జాతీయ అవార్డులను ప్రదానం చేయడంలో కీలకపాత్ర వహిస్తూ తెలుగు సాహిత్య సేవ చేస్తున్నారు.

అలాగే దేశంలోని వివిధ యూనివర్సిటీలలో బోర్టు ఆఫ్‌ స్టడీస్‌ మెంబర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ పాఠ్యప్రణాళికలను, సిలబస్‌ తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. విశ్వవిద్యాలయాలలో జరిగే కాన్ఫరెన్స్‌ లలో పాల్గొని 250కి పైగా పరిశోధక పత్రాలను సమర్పించారు. 16 తెలుగు సాహిత్య గ్రంథాలను ఇప్పటివరకు రచించి ముద్రించారు. ఆమె దగ్గర సాహిత్య పరిశోధనలో చేరిన 8 మంది పరిశోధకులకు పీహెచ్‌డీ ప్రదానం కాగా, ఇంకా 8 మంది పరిశోధకులకు గైడ్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement