● జిల్లావ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణాష్టమి
వేడుకలు
● పలు ఆలయాల్లో
డోలారోహణం,
ప్రత్యేక పూజలు
నిర్వహించిన
భక్తులు
నిజామాబాద్ రూరల్ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం శ్రీకృష్ణా ష్టమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించా రు. జిల్లాకేంద్రంతో పాటు ఆ యా మండలాలు, గ్రామాల్లో ని కృష్ణ మందిరాలకు ప్ర జలు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతా ల్లోని ప్రధాన వీధుల్లో స్థానిక యువకులు, చి న్నారులు ఉట్టి కొట్టి సంబురాలు నిర్వహించారు. న గరంలోని శివాజీ నగర్ వద్ద గల శ్రీకృష్ణ ఆలయం, గంగాస్థాన్ వద్ద గల కృష్ణ మందిరం వద్ద స్వామి వా రి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, డోలారోహణం, సామూహిక విష్ణుపారాయణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వా మివారికి ప్రత్యేక నైవేద్యాలు, చప్ప న్ భోగ్ సమర్పించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను కృష్ణ, గోపికల వేషధారణతో అలంకరించారు.
ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో..
నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో గల పైడి క న్వెన్షన్ హాల్‌లో ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆ ర్‌ఎస్‌ఎస్ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్ మాట్లాడుతూ.. స్వధర్మ పరిరక్షణ బాధ్యత ను హిందువులకు గుర్తు చేయడమే ఏకై క లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇస్కాన్ సే వా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఆధ్యా త్మికతతోపాటు దేశభక్తిని చాటుతున్నాయన్నారు. ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్ర అధ్యక్షుడు రామానంద రాయ్ గౌరదాస్, స్వామి యాదవ్ పాల్గొన్నారు.


