న్యూస్‌రీల్
నిజామాబాద్
● కలెక్టర్ భవేశ్ మిశ్రా
ఈఎంఐ చెల్లించలేక..
ఈఎంఐ చెల్లించలేక పోవడంతో లోన్ ఇచ్చిన కంపెనీ ఇంటిని సీజ్ చేయగా ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2026
– 8లో u
నీట్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్
సెంటర్ల పరిశీలన
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నీట్ పీజీ ఎంట్రెన్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ భవేశ్ మిశ్రా శనివారం పరిశీలించారు. అర్సపల్లిలోని ఏవీ ఎంటర్ ప్రైజెస్, మల్లారంలోని షిప్ట్ టెక్నాలజీస్ సెంటర్లలో మొత్తం 265 మంది పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో సరిపడా కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ధ్రువీకరణ పరికరాలు, ఇంటర్నెట్ కనెక్షన్ త దితర సదుపాయాలు అందుబాటులో ఉ న్నాయా లేదా అని కలెక్టర్ గమనించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చూడాలని, తాగునీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించా రు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఈవో అశోక్, డీ ఐఈవో రవికుమార్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, ఏసీపీ ప్రకాశ్, తహసీల్దార్లు వినయ్‌కుమార్, హరికిశోర్, కలెక్టరేట్ ఏవో బాలరాజు ఉన్నారు.
నేడు పీఆర్టీయూ ఎన్నికలు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవనంలో పీఆర్టీయూ ఎన్నికలను ఆదివారం నిర్వహించనున్నట్లు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మోహన్‌రెడ్డి, కిషన్ శనివారం తెలిపారు. రాష్ట్ర కమిటీ ఎన్నికల బాధ్యల సమక్షంలో ఎన్నికల ప్రక్రియ కొన సాగుతుందని, ఉదయం 10 గంటలకు స మావేశం ఉంటుందని, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. నామినేషన్‌ల దాఖలు, విత్ డ్రా ప్రక్రియ ముగిసిన తరువాత ఓటింగ్ నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని 33 మండలాల కార్యవర్గ సభ్యులు సుమారు 360 మంది ఓటింగ్‌లో పాల్గొంటారని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డిని
కలిసిన గడుగు
నిజామాబాద్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రైతు కమిషన్ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జి ల్లాకు చెందిన రైతు కమిషన్ సభ్యుడు గడు గు గంగాధర్ సీఎంకు పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఎంతో సమావేశమైన కమిషన్ సభ్యులు పలు అంశాలపై చ ర్చించారు. చిన్న నీటిపారుదల, చెరువుల పరిరక్షణపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సమర్పించిన నివేదికను సీఎం పరిశీలించారు. పంటల మార్పిడి, ఉద్యాన సాగు, ఎఫ్‌పీవోల ద్వారా రైతుల ఆదాయం పెంచడంపై మరింత దృష్టి సారించాలని, రైతు సంక్షేమం, నీటి భద్రత, గ్రామీణ తెలంగాణ సుస్థిర అభివృద్ధే ప్రజాప్రభుత్వ లక్ష్యం అని సీఎం పేర్కొన్నట్లు గడుగు తెలిపారు.
జిల్లాలోని ఓ మారుమూల మండలంలోని ఒక గ్రామానికి ఇటీవల పెద్ద లారీలో యూరియా లోడ్ వచ్చింది. అది సొసైటీది కాదు.. డీలర్‌ది కూడా కాదు. అధికారుల కళ్లుగప్పి రహస్యంగా బ్లాక్ మార్కెట్ వ్యాపారులు తీసుకొచ్చిన యూరియా లారీ అది. మార్కెట్‌లో యూరియా దొరకని పరిస్థితి చూసి రైతులు వేరే మార్గం లేక ఒక్కో బస్తాను రూ.700 నుంచి రూ.900 వరకు వెచ్చించి కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో కూడా ఇదే విధంగా బ్లాక్ మార్కెట్‌లో యూరియాను కొంటున్నారు.
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రభుత్వాలు యూరియా పంపిణీలో పారదర్శకత కోసం ఎన్ని యాప్‌లు తెచ్చి నా, సంస్కరణలు చేసినా బ్లాక్ మార్కెట్‌లో బహి రంగంగా యూరియా బస్తాలు దొరుకుతున్నాయి. అధికారిక నిబంధనలు, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా యూరియాను కొందరు వ్యాపారులు శాసిస్తున్నారు. ప్రభుత్వం ఎకరానికి రెండు బస్తాలను పరిమితం చేయడంతో మిగతా యూరి యా కోసం రైతులు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని, పరిస్థితులను ఆసరాగా చేసుకొని వ్యాపారులు అందినకాడికి దండుకుంటున్నారు. ఒక్కో బస్తాను ఏకంగా రూ.900 వరకు అమ్ముతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై రూ.267కే ఒక బస్తాను అందిస్తుండగా, బ్లాక్ మార్కెట్‌లో మూడింతలు చేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్‌లో 4.35 లక్ష ల ఎకరాల్లో వరి సాగవుతోంది. రెండు, మూడో డో సు కోసం పంటలకు సరిపడా యూరియా దొరక్క అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’ మొబైల్ యాప్‌లో ఎకరానికి కేవలం రెండు బస్తాల నిబంధన ఉండడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర కొరత ఏర్పడింది. పంట ఎదుగుదల దశలో యూరియా ఎంతో అవసరం కావడంతో దానికోసం రైతులు ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 4 బస్తాల వరకు యూరియాను వినియోగిస్తున్నారు. యాప్‌లో ఎకరానికి రెండు బస్తాలే రావడంతో మిగతా వాటి కో సం ఎక్కువ ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. పట్టాపాస్ పుస్తకాలున్న రైతులకే ఈ పరిస్థితి ఉండగా, ఎలాంటి భూమి పత్రాలు లేకుండా సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వీరు ఎకరానికి సరిపోయే యూరియా కోసం రూ.3 వేల దాకా ఖర్చు చేస్తున్నారు. అయితే, అధికారుల కళ్లుగప్పి యూరియా బస్తాలను జిల్లాకు తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. బహిరంగంగా రైతులను దోపిడీ చేసి సొమ్ము చేసుకుంటున్న బ్లాక్ మార్కెట్ వ్యాపారులను వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదనే విరమ్శలు వస్తున్నాయి.
ఒక్క బస్తా రూ.900కు విక్రయం
రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న కొంతమంది డీలర్లు
లారీల్లో గ్రామాలకు రహస్యంగా
చేరుకుంటున్న బస్తాలు
పట్టించుకోని జిల్లా యంత్రాంగం
బ్లాక్‌లో అమ్మే యూరియా ఎక్కడి నుంచి వస్తోంది..?
యాప్‌లో పెట్టిన పది సెకన్‌లలోనే యూరియా బస్తాలు బుక్ అయిపోతున్నాయి. చదువుకున్న మా పరిస్థితే ఇలా ఉంటే, చదువురాని రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. వారికి ఆన్‌లైన్‌లో ఒక్క బస్తా కూడా దొరకడం లేదు. దిక్కులేక బ్లాక్‌లో అధిక ధరకు యూరియా బస్తాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం యాప్‌లో ఎకరానికి రెండు బస్తాలనే పరిమితం చేస్తే, వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న బస్తాలు ఎక్కడి నుంచి వస్తున్నట్లు? దీనికి అధికారులే సమాధానం చెప్పాలి. – సామాజిక మాధ్యమాల ద్వారా
పలువురు రైతుల ఆవేదన
ధ్యాన్‌చంద్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న బీఆర్ నేత
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఫిజికల్ డైరక్టర్ (పీడీ) బీఆర్ నేత మేజర్ ధ్యాన్‌చంద్ ఎక్సలెన్స్ – 2026 అవార్డు అందుకున్నారు. జా తీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకొని శని వారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ నే తకు నిర్వాహకులు అవార్డును అందజేశారు. ము ఖ్యఅతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ జి బాలకిష్టారెడ్డి, గౌరవఅతిథిగా ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం పాల్గొన్నట్లు నిర్వాహకులు, తెలంగాణ మే ధావుల ఫోరం రాష్ట్ర శాఖ (తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం) అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ తెలిపారు. బీఆర్ నేతను వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందించారు.
బ్లాక్‌లో అమ్మితే చర్యలు
లైసెన్స్ కలిగిన డీలర్లు ఎవరైనా యూరియాను బ్లాక్ మార్కెట్ చేసి విక్రయిస్తే వారిపై చట్టపర చర్యలు తీసుకుంటాం. డీలర్లు అధిక ధర కు బస్తాలను అమ్మితే రైతు లు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. యూరియా కొరత లేదనే విషయాన్ని రైతులు గమనించాలి.
– వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి


