మోపాల్(నిజామాబాద్ రూరల్): బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్ ఆనుకుని ఉన్న ప్రయివేటు స్థలాన్ని కొంతమేర సేకరించి పాఠశాలను మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల పక్కనున్న ఆరోగ్య ఉపకేంద్రం, గ్రంథాలయ భవనాలను మరోచోటికి తరలించే అవకాశాలను పరిశీలించాలని, తద్వారా క్రీడా మైదానంతోపాటు అదనపు తరగతి గదుల నిర్మాణానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. నగరశివారులోని బోర్గాం(పి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న బోధనా సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో 1120 మంది విద్యార్థినీవిద్యార్థులు ఉండటం, ముగ్గురు ఉపాధ్యాయులను జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డులు వరించడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.
పాఠాలు బోధించిన కలెక్టర్
పదోతరగతిని సందర్శించిన కలెక్టర్.. విద్యార్థినీవిద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఫిజిక్స్, మ్యాథ్స్, ఆంగ్లం సబ్జెక్టులను బోధించి, ప లు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు పెన్నులు బహుమతిగా అందజేశారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యా బోధనను అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయా లని కలెక్టర్ సూచించారు. పిల్లలను కేవలం పా ఠ్యాంశాలకే పరిమితం చేయకుండా బయటి ప్రపంచానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం కూడా కల్పించాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు. ఏకాగ్రతతో చదువుకుని ఉజ్వల భవిష్యత్‌కు బాట లు వేసుకోవాలని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో రా ణించాలంటే విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. కలెక్టర్ వెంట డీఈవో పి అశోక్, మోపాల్ తహసీల్దార్ రేఖ, ఎంఈవో అమ్దాపూర్ సాయిలు, హెచ్‌ఎం శంకర్ తదితరులు ఉన్నారు.
సబ్‌సెంటర్, లైబ్రరీని
తరలించేందుకు ఏర్పాట్లు
విద్యార్థులు విషయ పరిజ్ఞానాన్ని
పెంపొందించుకోవాలి
కలెక్టర్ భవేశ్ మిశ్రా


