వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్‌లో శనివారం తెలుగు భా షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష గొప్పతనం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో స్కూలు డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గిడుగుదే ఘనత
రుద్రూర్: వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు, గొప్ప భాషావేత్త గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏ డాది ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తామని కవి, రచయిత నాగం సాయిలు అన్నారు. పొతంగల్ మండలం హెగ్డొలి గ్రామానికి చెందిన నాగం సాయిలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శనివారం సాక్షితో మాట్లాడారు. గిడుగు రామమూర్తి పంతులు చేసిన కృషి ఫలితంగానే నేడు తెలుగు భాషను సరళమైన వ్యవహారిక భాషలో మాట్లాడగలుగుతున్నామని పేర్కొన్నారు.


