న్యూస్‌రీల్
రీ సర్వేపై రైతులు ఏమంటున్నారు?
ఆదివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2026
– 8లో u
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో హైదరాబాద్ తరహా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని, మరో 10 నుంచి 20 రోజుల్లో కార్యాచరణను ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం పర్యటించిన ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లబ్ధిదారులకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోనూ స్థలం లేని వారికి ఇళ్లు కేటాయించేందుకు ప్రభుత్వ స్థలంలోనే ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటిని కేటాయించేలా చూస్తామన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు సిమెంట్ బ్యాగులు కేవలం రూ.230కి అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
లబ్ధిదారుల ఎంపికపై గతంలో విమర్శలు వ చ్చాయని, ప్రస్తుతం ఎలాంటి వివాదాలు లేకుండా అర్హులను ఎంపిక చేశారని అధికారులను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, మరిన్ని సంక్షేమ పథకాలు చేస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామన్నారు.
ఇందిరమ్మ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన..
నగరంలోని నాగారం ప్రాంతంలో నిర్మించిన డబు ల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంత్రి ఉదయం ఏడు గంటలకే పరిశీలించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రాతో మా ట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లబ్ధిదారులకు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లతోపాటు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం 43వ డివిజన్ పరిధిలోని పాములబస్తీలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణ పూర్తి చేసుకున్న లబ్ధిదారుకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించారు. ఆయనవెంట అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, నగర మేయర్ ఉమారాణి, హౌసింగ్ ఎండీ గౌతమ్, కలెక్టర్ భవేశ్ మిశ్రా, డీఆర్‌వో గీత, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులు ఉన్నారు.
రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారుకు ఇందిరమ్మ ఇంటి మంజూరుపత్రాన్ని అందజేస్తున్న మంత్రి పొంగులేటి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ తదితరులు
నాగారంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ధన్‌పాల్
ప్రజలకు మరింత
చేరువలో పరిపాలన
నిజామాబాద్ రూరల్ : ప్రజలకు పాలన మరింత చేరువయ్యేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని గూపన్‌పల్లి శివారులో రూ.2.25 కోట్లతో నిర్మించనున్న నిజామాబాద్ రూరల్, మోపాల్, ఇందల్వాయి తహసీల్ కార్యాలయాలు, రూ.కోటీ75 లక్షలతో నిర్మించనున్న భీమ్‌గల్, నిజామాబాద్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, రూ.2.22 కోట్లతో నిర్మించనున్న ఏర్గట్ల, డొంకేశ్వర్, సాలూర తహసీల్ కార్యాలయాలకు సంబంధించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక వసతులతో నిర్మించనున్న ఈ కార్యాలయాలు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన పరిపాలనా సేవలు అందించేందుకు దోహదపడనున్నాయన్నారు.
క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలి
పలువురు రెవెన్యూ అధికారులపై
మంత్రి పొంగులేటి ఆగ్రహం
రెవెన్యూ, గృహ నిర్మాణ కార్యక్రమాలపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో చేపడుతున్న భూముల రీ సర్వేపై రైతులు ఏమంటున్నారని, ప్రభుత్వంపై వారి అభిప్రాయం ఎలా ఉందని రా ష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో శనివారం పర్యటించిన మంత్రి.. రెవె న్యూ అంశాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలపై ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికా రులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ భారతి సదస్సులు సాదా బైనమా ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెడి తే ఎంతటి వారిన ఉపేక్షించేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. రీ సర్వే కొనసాగుతున్న గ్రా మాల్లో తహసీల్దార్లు తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీ సర్వేను ఏడాదిలోగా కచ్చితంగా పూర్తి చేయాలని, లైసెన్డ్స్ సర్వేయర్ల సేవలు వినియోగించుకోవాలన్నారు. ప్రజల కోసమే తమ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని, వారికి జవాబుదారీగా ఉండాలని మంత్రి స్ప ష్టం చేశారు. రెవెన్యూ అధికారులను ఆదేశించా రు. సర్వే, రిజిస్ట్రేషన్‌లపై సమాధానం చెప్పడంలో తడబడిన ఇందల్‌వాయి తహసీల్దార్‌ను మంత్రి దగ్గరికి పిలుచుకుని వివరాలు తెలుసుకున్నా రు. ఓ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశించిన మంత్రి.. ఆ అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. జక్రాన్‌పల్లి మండలం పరిధిలో ఫారెస్ట్‌కు సంబంధించిన భూ వివాదం గురించి తెలుసుకున్నారు. అలాగే నిజామాబాద్ రూరల్ తహసీల్దార్‌తో మాట్లాడి అసైన్‌మెంట్ భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో రీ సర్వేలో కలెక్టర్లు, రెవె న్యూ అధికారులు పాల్గొని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
‘డబుల్’ ఇళ్లపై..
కలెక్టరేట్ సమీపంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తక్షణమే పూర్తి చేసి హౌసింగ్ శాఖకు అప్పగించాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశించా రు. పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నిధుల కొరత లేదని పనులు పూర్తయిన 24 గంటల్లోనే బిల్లులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారయణ, పైడి రాకేశ్‌రెడ్డి, రెవె న్యూ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ లోకేశ్‌కుమార్, స్పెషల్ సెక్రెటరీ రాజీవ్‌గాంధీ హనుమంతు, గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు భవేశ్ మిశ్రా, ఆశిష్ సంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
పేదల సొంతింటి కల సాకారమే
ప్రభుత్వ సంకల్పం
సిమెంట్ బ్యాగును రూ.230కే
అందిస్తాం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి


