● ప్రభుత్వ ఉపాధ్యాయులపై బోధనేతర
పనుల భారం
● యాప్‌లు, ఆన్‌లైన్‌లో వివరాల నమోదుతోనే గడిచిపోతున్న సమయం
సిరికొండ: ఒకప్పుడు పాఠ్యాంశాలు బోధిస్తూ తీరిక లేకుండా గడిపే ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేడు బోధనేతర పనులతో బోధనకే సమయం దొరకడం లేదు. పాఠశాలకు ఉదయం వచ్చినప్పటి నుంచి యాప్, ఆన్‌లైన్ పనులతో కుస్తీ పడుతున్నారు. రా ష్ట్ర విద్యాశాఖతోపాటు జిల్లా, మండల స్థాయి అధికారులు అడిగే నివేదికలు పంపేందుకే ఉపాధ్యాయులు సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందటం లేదనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. పైతరగతికి పంపే పనితో ప్రారంభమై ఒకటవ తరగతిలో నూతన విద్యార్థుల నమోదు, ఇతర పాఠశాలల నుంచి వచ్చిన పిల్లలను చేర్చుకోవడం, వారికి సంబంధించిన సమగ్ర సమాచారం(జీపీ ఈపీఎఫ్‌పీ), టెక్ట్స్‌బుక్స్, నోటు బుక్స్, వర్క్ బుక్స్, ఏకరూప దుస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వంటి పనులు మొదటి మూడు నెలలూ ఉంటాయి. అలాగే నాలుగు నిర్మాణాత్మక పరీక్షలు, రెండు సంగ్రహణాత్మక పరీక్షలకు సంబంధించి విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి.
దేనికెంత సమయం..
20 నిమిషాలు : డీఎస్‌ఈ–ఎఫ్‌ఆర్‌ఎస్, 20 నుంచి 25 నిమిషాలు : రాగిజావ, 10 నుంచి 20 నిమిషాలు : కులాల వారీగా హాజరు, 1 నుంచి రెండు గంటలు : యూడైస్
బోధనకు మూడు గంటలే..
ఇటీవల విడుదల చేసిన విద్యా కమిషన్ నివేదికలో ఉపాధ్యాయులు బోధనేతర పనులతో కేవలం మూడు గంటలు మాత్రమే బోధనకు సమయం కేటాయిస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో ఒకరిద్దరూ ఉపాధ్యాయులు ఉన్నచోట ప్రధానోపాధ్యాయులు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మారిపోయారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌కు సంబంధించి ఆన్‌లైన్ పనులు యూ డైస్, ప్రశస్త యాప్‌తో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రతిరోజు బోధనేతర పనులతో రెండు గంటల సమయం వృథా అవుతుంది.
విముక్తి కల్పించండి
రోజురోజుకూ పెరుగుతున్న ఆన్‌లైన్ పనులతో ఉపాధ్యాయులు తీవ్ర మా నసిక ఒత్తిడికి గురై బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. వీలైనంత వర కు బోధనేతర పనులు తగ్గించాలి. ప్రా థమిక పాఠశాల ఉపాధ్యాయుల కు బోధనేతర పనులతో కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్లను ఇవ్వాలి.
– అంకం నరేశ్, పీఆర్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు


