నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు

Aug 23 2026 2:04 AM | Updated on Aug 23 2026 2:04 AM

సుభాష్‌నగర్‌: ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లు, ల్యాబ్‌లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు త ప్పవని డీఎంహెచ్‌వో రాజశ్రీ హెచ్చరించారు. నిజామాబాద్‌ నగరంలోని పలు ప్రయివేట్‌ ఆస్పత్రుల ను డీఎంహెచ్‌వో శనివారం తనిఖీ చేశారు. ఎస్‌ఎస్‌ బాలాజీ ఆస్పత్రిలో పార్కింగ్‌ స్థలం, ర్యాంపు లేకపోవడంతోపాటు బయో మెడికల్‌ వ్యర్థాల తొలగింపు ధ్రువపత్రం లేకపోవడం, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ను ప్రదర్శించకపోవడంపై మండిపడ్డారు. అలాగే అయ్యప్ప ఆస్పత్రి బోర్డుపై రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఏ ర్పాటు చేయలేదని, ఫారం–ఎఫ్‌లో సమాచారం అసంపూర్తిగా ఉందని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబే నర్సింగ్‌ హోంలో పలు లోపాలను గుర్తించారు. డీఎంహెచ్‌వో వెంట సీఈఏ విభాగం అధికారులు సుప్రియ, రామకృష్ణ, ప్రవీణ్‌, కీర్తన, డీహెచ్‌ఈ వేణుగోపాల్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement