కలెక్టరేట్‌లోకి దూసుకొచ్చిన బీజేపీ శ్రేణులు | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లోకి దూసుకొచ్చిన బీజేపీ శ్రేణులు

Aug 23 2026 2:04 AM | Updated on Aug 23 2026 2:04 AM

సమావేశం గది ఎదుట బైఠాయింపు

బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల వాగ్వాదం

చెదరగొట్టిన పోలీసులు

30 మందిపై కేసు నమోదు

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివా స్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తుండగా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. సెక్షన్‌ 22(ఏ) నిబంధనలో తప్పులు జరిగినట్లు ఒప్పుకున్న మంత్రి పొంగులేటి బాధ్యుడిగా రాజీనామా చేయాలంటూ హా ల్‌ ఎదుట బైఠాయించారు. ఆందోళన విషయం తె లుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు, బీజేపీ నాయకులపైకి దూసుకెళ్లారు. ఇరువురి మధ్య తీవ్ర తోపులా ట జరిగింది. మధ్యాహ్నం వేళ పోలీసులు భోజనం చేసేందుకు వెళ్లగా, అదే సమయంలో బీజేపీ నాయ కులు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న ఏసీపీ ప్రకాశ్‌ యాదవ్‌, రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ అడ్డుకునే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. వెంటనే స్పందించిన పోలీసులు సమావేశ మందిరం నుంచి బీజేపీ నాయకులను చెదరగొట్టుకుంటూ బయటికి లాక్కెళ్లారు. బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌, కార్పొరేటర్‌ స్రవంతి రెడ్డి, ఇతర నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగా రు. అనంతరం నాయకులను అరెస్టు చేసి మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా, కలెక్టరేట్‌లో నిరసన చేపట్టిన 30 మంది బీజేపీ నాయకులపై రూరల్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసులు నమోదై న వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి, కార్పొరేటర్‌ స్రవంతి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement