రాఖీ మెయిల్‌ బుకింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

రాఖీ మెయిల్‌ బుకింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు

Aug 23 2026 2:04 AM | Updated on Aug 23 2026 2:04 AM

నిజామాబాద్‌ రూరల్‌: రక్షాబంధన్‌ నేపథ్యంలో సోదరీమణులు దూరప్రాంతాల్లోని తమ సోదరులకు రాఖీలు పంపించేందుకు భారతీయ తపాలా సేవలను వినియోగించుకోవాలని నిజామాబాద్‌ డివిజన్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసెస్‌ కె జనార్దన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. రాఖీ మెయిల్‌ను సులభంగా బుక్‌ చేసుకునేందుకు నిజామాబాద్‌, ఆర్మూర్‌, కామారెడ్డి హెడ్‌పోస్టాఫీసులను ఆదివారం, సెలవు దినాల్లో కూడా తెరిచి ఉంచి సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాఖీ మెయిల్‌ బుకింగ్‌పై పది శాతం ప్రత్యేక డిస్కౌంట్‌ అందుబాటులో ఉందని తెలిపారు.

శక్తి స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలి

ఖలీల్‌వాడి: పాలిటెక్నిక్‌ డిప్లొమా, ఐటీఐ కాలేజీలను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకోవడానికి ఉద్దేశించిన శక్తి స్కీమ్‌ను ప్రభుత్వం రద్దు చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ గౌతమ్‌కుమార్‌, నగర అధ్యక్షుడు సిర్రం పవన్‌ డి మాండ్‌ చేశారు. పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ వద్ద పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ సాంకేతిక విద్యను ప్ర యివేట్‌ పరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని, పేద, మధ్యతరగతి విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతోందని విద్యార్థి నాయకు లు ఆవేదన వ్యక్తం చేశారు. పీడీఎస్‌యూ నగర నాయకులు మహేశ్‌, హరికృష్ణ, ప్రమోద్‌, వంశీ, శ్రావణ్‌, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

బాల్‌బ్యాడ్మింటన్‌ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక

ఆర్మూర్‌: తెలంగాణ రాష్ట్ర స్థాయి 45వ సబ్‌ జూనియర్‌ బాల్‌బ్యాడ్మింటన్‌ క్రీడా పోటీలకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా జట్టు ను ఎంపిక చేసినట్లు బాల్‌బ్యాడ్మింటన్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రావణ్‌రెడ్డి, ప్ర ధాన కార్యదర్శి బోనగిరి శ్యాం శనివారం తెలిపారు. ఆర్మూర్‌ పట్టణంలోని విజయ్‌ హైస్కూల్‌ మైదానంలో ఎంపిక పోటీలు ని ర్వహించగా 130 మంది క్రీడాకారులు పోటీ పడగా.. ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారు లు ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు సంగారెడ్డి జిల్లా బీహెచ్‌ఈఎల్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని శ్రావణ్‌ తెలిపారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సునీత, కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి రాజేశ్వర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ నాగేశ్‌, సభ్యులు సురేశ్‌, విజయ్‌ హైస్కూల్‌ కరస్పాండెంట్‌ కవిత దివాకర్‌, హెచ్‌ఎం రమాదేవి, సీనియర్‌ క్రీడాకారులు ఆనంద్‌, కార్తీక్‌, సాయికుమార్‌, శ్రీనివాస్‌, వ్యాయామ ఉపాధ్యాయులు శ్యామల, మహేశ్‌, యూ మహేశ్‌, శివ, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement