● ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
వర్ని: ఇటీవల కురిసిన వర్షాల మూలంగా మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్‌లోకి ఖరీఫ్, రబీ పంటలకు సరిపడా సాగునీరు వచ్చి చేరినట్లు ప్రభు త్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం ప్రాజెక్టు పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాజెక్టులోకి కొత్తగా వచ్చి చేరిన నీటికి పూజలు నిర్వహించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. రిజర్వాయర్‌లో నాలుగు తూములకు గాను రెండిటి నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే ఆయకట్టు పరిధిలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సిద్దాపూర్ సర్పంచ్ బాల్ సింగ్, జాకోరా సొసైటీ చైర్మన్ దశరథ్ పాల్గొన్నారు.


