పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ పరిశీలన

Aug 7 2026 2:14 AM | Updated on Aug 7 2026 2:14 AM

రుద్రూర్‌: పోతంగల్‌ మండలం కారేగావ్‌లో రేషనలైజేషన్‌ ప్రక్రియలో భాగంగా గురువారం 9,10 పోలింగ్‌ స్టేషన్‌లను బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌ రెడ్డి పరిశీలించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తర్వాత గ్రామసభ నిర్వహించి పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రతిపాదిత మార్పులపై గ్రామస్తులకు వివరించారు. వారి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. సర్పంచ్‌ సునీల్‌, తహసీల్దార్‌ సందీప్‌ తదితరులు ఉన్నారు.

బీఎల్‌వోలకు సన్మానం

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆలూర్‌ మండల కేంద్రంలో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసిన బీఎల్‌వోలను కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దేగాం ప్రమోద్‌, సర్పంచ్‌ ముక్కెర విజయ్‌, కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ ఉదయ్‌, నాయకులు ముత్యం రెడ్డి, నారాయణ, గంగారెడ్డి, మోతె శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆర్మూర్‌ ఎంఈవోకు..

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మండల ఎంఈవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డి.రవీందర్‌ను టీఎస్‌ మెసా, ఏపీసీఆర్‌, జమా తే ఇస్లామి హింద్‌ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. టీఎస్‌ మెసా గౌరవ అధ్యక్షుడు మహమ్మద్‌ అశ్ఫాక్‌ అహ్మద్‌, ఆలూ ర్‌ ఎంఈవో నరేందర్‌, జబ్బార్‌, ఇమ్రాన్‌ జా బ్రీ, మతీన్‌, సాజీద్‌, తదితరులు పాల్గొన్నారు.

అసత్య ఆరోపణలు చేయొద్దు

కమ్మర్‌పల్లి(మోర్తాడ్‌): బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిపై, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్‌ అసత్య ఆరోపణలు మానుకోవాలని మోర్తాడ్‌ మండల బీఆర్‌ఎస్‌ నాయకులు హితవు పలికారు. గురువారం మోర్తాడ్‌ మండల కేంద్రంలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల వద్ద బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కల్లెడ ఏలియా, సర్పంచ్‌ బోగ ఆనంద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌ తదితరులు మాట్లాడారు. సునీల్‌ అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నాయకులు పాపాయి పవన్‌, పర్స దేవన్న, శ్రీనివాస్‌, అశోక్‌, ఇంత్యాజ్‌, గంధం మహిపాల్‌, సామ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను విమర్శించే

అర్హత బీజేపీ నేతలకు లేదు

రెంజల్‌: మచ్చ లేని నాయకనిగా రాష్ట్రంలోనే పేరున్న ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని విమర్శించే అర్హత బీజేపీ నాయకులకు లేదని మండల కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. గురువారం సాటాపూర్‌లో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మొబిన్‌ఖాన్‌ మాట్లాడారు. బీజేపీ జిల్లా అద్యక్షుడితో పాటు స్థానిక బీజేపీ నాయకులు రెంజల్‌లోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ చేసిన అవినీతి, అక్రమాలను ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కాపాడుతున్నారని చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సర్పంచ్‌లు ధనుంజయ్‌, మల్లేశ్‌, గయాసోద్దిన్‌, మాజీ సర్పంచ్‌లు జావీద్‌, వినోద్‌, తదితరులు పాల్గోన్నారు.

ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత

మాక్లూర్‌: రెండో విడుతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు గురువారం స్థానిక సర్పంచ్‌ కూన లతసాగర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గంగాధర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మంజూరు పత్రాలు అందజేశారు. ఉపసర్పంచ్‌ చిరంజీవి, వార్డు సభ్యులు బోజేంధర్‌, లింగన్న, రూప, కూన సాగర్‌, ఇందిరమ్మ సమిటీ సభ్యులు పాల్గొన్నారు.

జైల్‌ భరోను విజయవంతం చేయండి

ఆర్మూర్‌/ఆర్మూర్‌టౌన్‌/నవీపేట: క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, జైల్‌ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐయూకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకరగౌడ్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాయక్‌వాడి శ్రీనివాస్‌లు పిలుపునిచ్చారు. గురువారం వారు ఆర్మూర్‌, నవీపేటలో వేర్వేరుగా మాట్లాడి వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై కేంద్రం తీరును వ్యతికేరిస్తూ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement