ఆహార ఉత్పత్తులతో అదనపు ఆదాయం | - | Sakshi
Sakshi News home page

ఆహార ఉత్పత్తులతో అదనపు ఆదాయం

Aug 7 2026 2:14 AM | Updated on Aug 7 2026 2:14 AM

రుద్రూర్‌: మహిళా రైతులు, గ్రామీణ యువత పాలు, మాంసం, గుడ్లతో విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులను తయారు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని వ్యవసాయ పరిశోధన కేంద్రం అధి పతి పవన్‌ చంద్రారెడ్డి తెలిపారు. రుద్రూర్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో మహిళలకు మూడు రోజుల పాటు నిర్వహించిన పాలు, మాంసం, గుడ్ల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, నిల్వ సాంకేతికతలపై శిక్షణ కార్యక్రమం గురువా రం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పవన్‌ చంద్రారెడ్డి హాజరై మాట్లాడారు.. నాణ్య తా ప్రమాణాలు, పరిశుభ్రత, ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఉత్పత్తులు తయారు చేస్తే మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుందని తెలిపారు. అనంతరం పుడ్‌ సైన్స్‌ టెక్నాలజీ కళాశాల అసోసియేట్‌ డీన్‌ వెంకట్‌ రెడ్డి మాట్లాడారు. పలు ఉత్పత్తుల తయారీ విధానాలను ప్రదర్శించారు. మూడు రోజుల శిక్షణ కార్యక్రమానికి కోర్సు ఇనన్‌చార్జీలు జె. సాయిప్రసాద్‌, ఎం. ప్రశాంతి సమర్థవంతంగా నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement