డ్రగ్స్‌పై అవగాహన సదస్సు | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌పై అవగాహన సదస్సు

Aug 7 2026 2:14 AM | Updated on Aug 7 2026 2:14 AM

ఆర్మూర్‌టౌన్‌: మన కాలనీ– మన భద్రత– మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని నారాయణ స్కూల్‌లో గురువారం ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్‌ డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సోషల్‌ మీడియాలో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా హెల్మెట్లు ధరించడం, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పాటించడం తప్పనిసరన్నారు. ఆడపిల్లల భద్రత కోసం షి టీమ్‌ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు.

నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

ఆర్మూర్‌టౌన్‌: ప్రతి బంగారు షాపులో తప్పనిసరిగా నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు పనిచేసేలా చూసుకోవాలని ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో గురువారం గోల్డ్‌షాప్‌ దుకా ణ యజమానులతో సమావేశం నిర్వహించి ఆయ న మాట్లాడారు. దుకాణంలోకి వచ్చే ప్రతి కస్టమర్‌ వివరాలు, వాహన నెంబర్లను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112కు డయల్‌ చేసి పోలీసులకు సమాచా రం అందించాలన్నారు. భద్రత విషయంలో ఎవ రూ అలసత్వం వహించొద్దన్నారు. మంచిర్యాల కిషన్‌, వైద్య సంజయ్‌, సాగర్‌ పాల్గొన్నారు.

సమయానికి బస్సులు

నడపాలని రాస్తారోకో

రెంజల్‌: పాఠశాల సమయానికి బస్సులు నడపాలని డిమాండ్‌ చేస్తూ గురువారం సాటాపూర్‌ చౌరస్తాలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. సాటాపూర్‌తో పాటు బోర్గాం, నీలా, కందకుర్తి గ్రామాల నుంచి విద్యార్థులు రెంజల్‌ ఆదర్శ పాఠశాలతో పాటు రెంజల్‌ హైస్కూల్‌, వీరన్నగుట్ట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెళతారు. ఆర్‌టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సమయానికి పాఠశాలలకు చేరుకోలేకపొతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు విద్యార్థుల సమస్యను గుర్తించి సమయానికి బస్సులు నడపాలని మాజీ సర్పంచ్‌ ఎఖార్‌పాష, మాజీ ఎంపీటీసీ హైమద్‌లు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

కమ్మర్‌పల్లి: మండలంలోని బషీరాబాద్‌ ఐటీఐ కళాశాలో రెండో విడత ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ కోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్‌లను 17వ తేదీ వరకు పరిశీలిస్తామన్నారు. 20న సీట్లను కేటాయిస్తామన్నారు. టెన్త్‌ క్లాస్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విద్యార్థులకు టై, బెల్టుల వితరణ

వేల్పూర్‌: కోమన్‌పల్లి ప్రైమరీ స్కూలులో విద్యార్థులకు గురువారం స్థానిక నాయకుడు తెడ్డు గంగాధర్‌ వితరణ చేసిన టై బెల్టులను స్థానిక సర్పంచ్‌ కొత్తింటి రాజేందర్‌ అందజేశారు. తెడ్డు గంగాధర్‌కు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement