కమ్మర్‌పల్లి(మోర్తాడ్): మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన జిన్న రవి(38) అనే వ్యక్తి వారం రోజుల క్రితం దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. రవి నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కంపెనీ వీసాపై దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఇన్నోవా బిల్డ్ ఎల్‌ఎల్‌సీ కంపెనీలో కార్మికుడిగా చేరాడు. ఈక్రమంలో జూలై 31న కంపెనీలో పని చేస్తుండగా, చాతీలో నొప్పిగా ఉందంటూ అకస్మాత్తుగా కుప్పకూలాడు. తోటి కార్మికులు, సోదరుడు భూమేష్ కలిసి ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు ధృవీకరించారు. రవి రెండేళ్ల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. రవికి వృద్ధురాలైన తల్లి గంగుబాయి ఉన్నారు. కాగా రవి మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరుకోనుంది.


