ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

Aug 7 2026 2:14 AM | Updated on Aug 7 2026 2:14 AM

ఆర్మూర్‌టౌన్‌: మున్సిపల్‌ నుంచి అందజేస్తున్న మొ క్కలను ప్రతిఒక్కరు తమ ఇంటి ఆవరణలో నాటి వాటిని సంరక్షించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోనె లహరి అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని 1వ వా ర్డులో వనమహోత్సవంలో భాగంగా గురువారం ఆమె చేతుల మీదుగా మొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఆ ర్మూర్‌ ఏఎంసీ చైర్మన్‌ సాయిబాబా గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి రాజు, తదితరులున్నారు.

బోధన్‌లో..

బోధన్‌టౌన్‌(బోధన్‌): ప్రతీఒక్కరు మొక్కను నాటి బాధ్యతగా పరిరక్షించాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తూము పద్మాశరత్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో వన మహోత్సవాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మాట్లాడారు. మొక్కలు పెరిగే వరకు పరిరక్షించాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ జాదవ్‌ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఆర్మూర్‌లో మొక్కలు పంపిణీ చేస్తున్న

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోనె లహరి

బోధన్‌లో మొక్కలు నాటుతున్న

మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తూము పద్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement