నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు జలకళ | - | Sakshi
Sakshi News home page

నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు జలకళ

Jul 30 2026 5:18 AM | Updated on Jul 30 2026 5:18 AM

ప్రతి పోలీస్‌ బాధ్యతగా పని చేయాలి

నిజాంసాగర్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ రప్రదాయిని అయిన నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి బుధవారం 6,585 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. కౌలాస్‌నాలా ప్రాజెక్టులోకి 740 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని పేర్కొన్నారు.

‘పోచారం’లోకి 5,377 క్యూసెక్కులు..

నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టులోకి 5,377 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ఇరిగేషన్‌ ఏఈ అక్షయ్‌కుమార్‌ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 0.470 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

ఖలీల్‌వాడి: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో అశోక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని స్థానిక, ప్రభుత్వ, ఎయిడెడ్‌, రెసిడెన్షి యల్‌, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీలలో పని చేస్తున్న ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల నుంచి సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందించే రాష్ట్రస్థాయి అవార్డు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. బోధనలో 10 సంవత్సరాల అనుభవం కలిగిన ఉపాధ్యాయు లు, 15 సంవత్సరాల అనుభవం ఉన్న హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు అర్హులని తెలిపారు. అర్హులు సంబంధిత దరఖాస్తులను ఈ నెల 7లోగా డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

ప్రభుత్వ లక్ష్యాలకు

అనుగుణంగా విద్యాబోధన

డీఈవో అశోక్‌

మోపాల్‌: ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యా బోధన చేపట్టాలని డీఈవో అశోక్‌ సూచించారు. నగర శివారులోని బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్‌లో కొనసాగుతున్న జీహెచ్‌ఎంల శిక్షణ శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని, హాజరుశాతం పూర్తిస్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని తెలిపారు. అనంతరం గురుపౌర్ణమి సందర్భంగా డీఈ వోను ఉపాధ్యాయులు సన్మానించారు. కార్యక్రమంలో సెంటర్‌ ఇన్‌చార్జి శంకర్‌, ఆర్‌పీలు చంద్రశేఖర్‌, లక్ష్మీనర్సయ్య, ఆనంద్‌, పండరి, రాజ్‌ మంజూష, హరిత, 120 మంది ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

సీపీ సాయి చైతన్య

నిజామాబాద్‌ రూరల్‌: ప్రతి పోలీస్‌ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సీపీ సాయిచైతన్య అన్నారు. నగరంలోని కంఠేశ్వర్‌లో ఉన్న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యా దులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పీఎస్‌లో నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసుల దర్యా ప్తు, బీట్‌ డ్యూటీ వ్యవస్థ, రౌడీషీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల డిజిటల్‌ నిర్వహణ, సిబ్బంది హాజరు, డ్యూటీ విధానాలు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం పీఎస్‌ ఆవరణలో మొక్కలు నాటి వాటికి నీరు పోశా రు. ఏసీపీ బీ ప్రకాశ్‌ యాదవ్‌, సీసీఆర్‌బీ ఏసీపీ గురు నాయుడు, రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌, ఎస్సైలు ఎండీ షరీఫ్‌, ఏ ఆనంద్‌ సాగర్‌, మహేశ్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement