ట్రాన్స్‌కో ఏఈ ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో ఏఈ ఇంట్లో చోరీ

Jul 21 2026 2:12 AM | Updated on Jul 21 2026 2:12 AM

కామారెడ్డి క్రైం : తాళం వేసి ఉన్న విద్యుత్‌శాఖ ఏఈ ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డిలోని కాకతీయనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న గంగాధర్‌ సదాశివనగర్‌ ట్రాన్స్‌కో ఏఈగా పని చేస్తున్నారు. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని ఆదివారం ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి గంభీరావుపేటకు వెళ్లారు. దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చిన గంగాధర్‌ కుటుంబం ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్‌ సీఐ శ్రీధర్‌ గౌడ్‌, దేవునిపల్లి ఎస్సై రంజిత్‌, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్‌టీం బృందం ఆధారాలు సేకరించింది. బీరువాలో దాచి ఉంచిన 3 తులాల బంగారం, 20 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

3 తులాల బంగారం,

20 తులాల వెండి అపహరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement