నాడు తండ్రి.. నేడు కొడుకు మృతి
● ఆ కుటుంబానికి శాపంగా మారిన రోడ్డు ప్రమాదాలు
బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ కుటుంబానికి రోడ్డు ప్రమాదాలు శాపంగా మారాయి. బీర్కూర్‌కు చెందిన తాటిచెట్ల రాములుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహం కాగా, చిన్నకుమారుడు రవి(18) హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. గతేడాది కుటుంబానికి పెద్ద దికై ్కన రాములు లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. శనివారం చిన్న కుమారుడు రవి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా హైదరాబాద్ సమీపంలోని గుమ్మడిదల వద్ద ఢీవైడర్‌ను ఢీకొని మృతి చెందాడు. తండ్రి, కొడుకు మృతి చెందడంతో కుటుంబానికి రోడ్డు ప్రమాదాలు శాపంగా మారాయని గ్రామస్తులు వాపోయారు. బీర్కూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
బాన్సువాడ: పొలానికి వెళ్తుండగా ఓ రైతు బురదలో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడ పట్టణానికి చెందిన గొల్ల సంగయ్య(70) అనే రైతు ఆదివారం ఉదయం తన పొలం వద్దకు బయలుదేరాడు. ఈక్రమంలో పొలాల్లోని బురదలో వెళుతుండగా కాళ్లు ఇరుక్కపోయి పడిపోయాడు. ముఖం బురదలో కూరుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలున్నారు.


