అనుమానితుల సమాచారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

అనుమానితుల సమాచారం అందించాలి

Jul 13 2026 1:40 AM | Updated on Jul 13 2026 1:40 AM

అనుమానితుల సమాచారం అందించాలి

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ అన్నారు. ఆర్మూర్‌లోని నల్లపోచమ్మ గల్లీలో ఆదివారం కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాంలో భాగంగా కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈసందర్భంగా పోలీసులు ఉదయం నుంచి కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసి, వివరాలు సేకరించారు. వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్‌హెచ్‌వో మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. కాలనీల్లో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు ప్రతి ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన 50 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను సీజ్‌ చేశారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పేకాడుతున్న నలుగురి అరెస్టు

ఇందల్వాయి: మండలంలోని గన్నారం గ్రామాశివారులోగల పేకాట స్థావరంపై శనివారం రాత్రి దాడులు నిర్వహించినట్లు ఎస్సై సుమలత తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేయగా, పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ.12,760 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement