అవకాశం ఎవరికో ? | - | Sakshi
Sakshi News home page

అవకాశం ఎవరికో ?

Jul 8 2026 2:08 AM | Updated on Jul 8 2026 2:08 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌
నేటితో ముగియనున్న నాలుగు కార్పొరేషన్‌ల చైర్మన్‌ల పదవీకాలం

పాతవారికే మళ్లీ అవకాశమా?

కొత్త వారొస్తారా?

ఇప్పటివరకు జిల్లా నుంచి మంత్రివర్గంలో దక్కని ప్రాతినిధ్యం

ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా..

ట్రాన్స్‌ఫార్మర్‌ల నుంచి రాగి కాయిల్స్‌ చోరీ చేస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు.

బుధవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2026

– 8లో u

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లా నుంచి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌లకు చైర్మన్‌లుగా ఉన్న వారి పదవీకాలం బుధవారంతో ముగియనుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి ఐదుగురికి కార్పొరేషన్‌ చైర్మన్లుగా అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో పాత వారికే మళ్లీ అవకాశం ఇస్తారా? లేదా కొత్త వారిని తీసుకువస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. తమ పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తారని ఆయా కార్పొరేషన్‌ల చైర్మన్లు భావిస్తుండగా, ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌లోని సీనియర్‌ నేతలు, ఆశావహులు పేర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లా నుంచి..

ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర కో ఆపరేటివ్‌ యూనియన్‌ చైర్మన్‌గా మానాల మోహన్‌రెడ్డి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఈరవత్రి అనిల్‌కుమార్‌, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అన్వేష్‌రెడ్డి, వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కాసుల బాలరాజు, గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ చైర్మన్‌గా చంద్రశేఖర్‌గౌడ్‌ ఉన్నారు. అయితే చంద్రశేఖర్‌గౌడ్‌ను మినహాయించి రెండేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టిన నలుగురి పదవీకాలం ముగియనుంది. చంద్రశేఖర్‌గౌడ్‌ ఈ ఏడాది మే నెలలో నియమితులైన విషయం తెలిసిందే. ఏకకాలంలో నాలుగురు రాష్ట్రస్థాయి పదవులు ఖాళీ అవుతుండగా.. ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి లేని ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్‌ పదవుల భర్తీపై ఉత్కంఠ నెలకొంది.

ఉమ్మడి జిల్లాకు తగిన ప్రాధాన్యంపై ఆశలు..

రాష్ట్ర మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్‌ తరఫున బోధన్‌ నుంచి పి.సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ నుంచి భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్‌మో హన్‌రావు, జుక్కల్‌ నుంచి లక్ష్మీకాంతారావు గెలుపొందగా, బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున గెలుపొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. వీరిలో సుదర్శన్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు. ఈసారి చేపట్టనున్న మంత్రివ ర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి.

మానాల మోహన్‌రెడ్డి

కాసుల బాలరాజు

అన్వేష్‌రెడ్డి

ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రస్థాయి కార్పొరే షన్‌ చైర్మన్‌ పదవుల్లో కొనసాగుతున్న నలుగురి పదవీకాలం నేటితో ముగియనుంది. ఒకేసారి నాలుగు పదవులు ఖాళీ అవు తుండడంతో పాత వారికే మళ్లీ అవకాశం ఇస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆశావహుల జాబితా పెద్దగానే ఉంది. ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement