● నిర్మాణానికి కొలతలు తీసుకున్న ఇరిగేషన్ అధికారులు
డొంకేశ్వర్(ఆర్మూర్): గోదావరి ఒడ్డున డొంకేశ్వర్ మండలం నికాల్‌పూర్ శివారులో పుష్కరఘాట్ నిర్మాణానికి తొలి అడుగుపడింది. ఇరిగేషన్ అధికారులు మంగళవారం ఘాట్ నిర్మాణం కోసం కొలతలు తీసుకున్నారు. ఏఈ యోగేశ్‌రెడ్డి, సిబ్బంది శంక్‌తో కలిసి నికాల్‌పూర్ గోదావరిని సందర్శించా రు. ఘాట్ ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందో గ్రామస్తుల ద్వారా తెలుసుకుని కొలతలు తీసుకున్నారు. ఘాట్ పొడవు, వెడల్పు ఎంతమేర నిర్మిస్తే పుష్కర స్నానాలకు బాగుంటుందని ఆరా తీసి ఎస్టిమేషన్ వేశారు. ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏఈ తెలిపారు. నాయకులు బానో త్ సుమన్, నవీన్, సుభాష్, ముత్తెన్న తదితరులున్నారు.
సీఎస్‌ను కలిసిన
రెవెన్యూ సంఘం ప్రతినిధులు
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజును రెవెన్యూ సంఘం ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గౌతమ్‌కుమార్, ఉపాధ్యక్షుడు నిరంజన్‌రావు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్‌రెడ్డి, కో ఆర్డినేటర్ నారాయణరెడ్డి, విక్రమ్ తదితరులున్నారు.
నియామకం
వేల్పూర్: డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్స్ వెల్ఫేర్ అసో సియేషన్ ఇండియా తెలంగాణ శాఖ కోశా ధికారిగా ఎంపికై నట్లు మండలంలోని జాన్కంపేట్‌కు చెందిన జంగం అశ్విన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌గా కొనసాగుతున్న ఆయన సుమారు దశాబ్దకాలంగా వివిధ జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. జంగం అశ్విన్ ఎంపికపై సర్పంచ్ సంతోష్‌రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
మోడల్ స్కూల్‌లో
అవకతవకలపై ఆరా!
ఖలీల్‌వాడి: రెంజల్ మండల కేంద్రంలోని అదర్శ పాఠశాల్లో జరిగిన అక్రమాలపై ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం ఆరా తీసినట్లు తెలిసింది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు కలెక్టర్ ఇలా త్రిపాఠికి నివేదికను అందజేశారు. పాఠశాల ఆవరణలో నాటిన చెట్లను నరికివేసి కలపను అమ్మేసుకోవడం, మధ్యాహ్న భోజనానికి రెండు రిజిస్టర్లు నిర్వహించడంతోపాటు ప్రతినెలా ప్రిన్సిపాల్ ఖా తాలో ఆన్‌లైన్ ద్వారా రూ.20వేల వరకు జమవుతున్నట్లు గుర్తించారు. తనను తప్పు పడితే సస్పెండ్ చేస్తానని బెదిరించడం, అ క్రమాలకు అడ్డు వచ్చే వారిని విధులను తొ లగిస్తారని ప్రిన్సిపాల్‌పై ఆరోపణలు వ చ్చా యి. ఈ వ్యవహారంపై ఆరా తీసిన ఇంటె లిజెన్స్ నందిపేట్ పీఎంశ్రీ మోడల్ స్కూల్‌లో పన్నెండేళ్లపాటు విధులు నిర్వర్తించిన కాలంలోనూ ప్రిన్సిపాల్ నిధులు గోల్‌మాల్ చేశారని, హాస్టల్ నిర్మాణాన్ని అడ్డుకున్నారని నిర్దారణకు వచ్చినట్లు సమాచారం.
రీ సర్వేకు సహకరించాలి
రుద్రూర్: భూముల రీ సర్వేకు అందరూ సహకరించాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కోరారు. మండలంలోని చిక్కడపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆధునిక పరిజ్ఞానంతో పక్కాగా బౌండరీలను నిర్ణయిస్తామని అన్నారు. రీ సర్వే ద్వారా భూ రికార్డులు మ రింత పారదర్శకంగా, కచ్చితంగా రూపొందుతాయన్నారు. సర్వే రిపోర్టు వచ్చిన అనంతరం తప్పులు ఉంటే 60 రోజులలో గా అభ్యంతరాలు తెలుపొచ్చన్నారు. తహసీల్దార్ తారాబాయి, సర్పంచ్ రమేశ్, ఉప సర్పంచ్ కళ్యాణ్, డీఐవోఎస్ దత్తు, సూపరింటెండెంట్ జగదీశ్, ఏడీసీసీ ప్రథమ్‌కుమా ర్, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.


