● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య
పెంచాలి
● ‘సంకల్ప్’ సమావేశంలో
కలెక్టర్ ఇలా త్రిపాఠి
సుభాష్‌నగర్: జిల్లాలో మాతా శిశుమరణాలు చోటు చేసుకోకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రభుత్స ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య ను పెంచాలన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో సంకల్ప్ సమావేశం నిర్వహించారు. గర్భిణుల నమోదు, రక్తహీనత, హైరి స్క్ గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై వైద్యాధికారులకు ఈ సందర్భంగా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. గర్భిణుల్లో రక్తహీనత సమస్య తలెత్తకుండా వైద్య సేవలు అందించాల న్నారు. ప్రత్యేకించి హై రిస్క్ కేసుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, క్రమం తప్ప కుండా వారికి ఆరోగ్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. హై రిస్క్ కేసులను జీజీహెచ్‌కు రిఫర్ చేయాలని సూచించారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యా మిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో కృషి చేయాలన్నారు. డీఎంహెచ్‌వో బి రాజశ్రీ, డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విశాల్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సికిందర్ నాయక్, పీడియాట్రిక్ అసోసియేషన్ ప్రతినిధులు, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లు, జీజీహెచ్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సీ్త్ర వైద్యనిపుణులు, పిల్లల వైద్య నిపుణులు, మత్తు వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు.


