● జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించిన కమాండెంట్ సత్యనారాయణ
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్(డిచ్‌పల్లి)లో ఇంటర్ కంపెనీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ – 2026 పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యా యి. ముఖ్యఅతిథిగా హాజరైన కమాండెంట్ పి.సత్యనారాయణ జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. క్రీడలు శారీరక ధృడత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. వారం రోజులపాటు పోటీలు కొనసాగుతాయన్నారు. తొలిరోజు అథ్లెటిక్స్, వాలీబాల్, క్రికెట్, ఖోఖో, క్యారం, చెస్ తదితర పోటీల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. అసిస్టెంట్ కమాండెంట్లు వి.నరసింహస్వామి, డి శ్రీనివాసరావు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, కంపెనీ కమాండర్లు, ట్రైనర్లు, బెటాలియన్ సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


