ఈనెల 18న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

ఈనెల 18న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

Jul 8 2026 2:08 AM | Updated on Jul 8 2026 2:08 AM

చెక్‌ బౌన్స్‌ కేసుల పరిష్కారం కోసం..

రాజీకి వీలున్న కేసులు 264

జిల్లా న్యాయమూర్తి జీవీఎన్‌ భారతలక్ష్మి

నిజామాబాద్‌ లీగల్‌ : చెక్‌ బౌన్స్‌ కేసుల పరిష్కా రం కోసం ఈనెల 18వ తేదీన ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యా యమూర్తి, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్‌పర్సన్‌ జీ వీఎన్‌ భారతలక్ష్మి తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులోని సమావేశ మందిరంలో న్యాయవాదులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించగా, బార్‌ అధ్యక్షుడు డి. నీలకంఠరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా న్యా యమూర్తి మాట్లాడుతూ.. జిల్లాలోని నిజామాబా ద్‌, ఆర్మూర్‌, బోధన్‌ కోర్టుల్లో 1,832 చెక్‌ బౌన్స్‌ కేసు లు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ కేసుల్లో ఇప్పటి వరకు 391 మందిపై నాన్‌ బెయిలబుల్‌ వారంట్లు జారీ అయ్యాయని వివరించారు. రాజీకి అవకాశం ఉన్న 264 కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు కోర్టుకు హాజరు కావాలని సమనన్‌లు పంపనున్నట్టు తెలిపారు. ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని చెక్‌బౌన్స్‌ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎన్‌ సుభాష్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆవుల నారాయణ, సీనియర్‌ న్యాయవాదులు జీవీ కృపాకర్‌రెడ్డి, పరుచూరి శ్రీధర్‌, నరేందర్‌రెడ్డి, జగన్‌మోహన్‌గౌడ్‌, మధుసూదన్‌గౌడ్‌, మాణిక్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement