● డీఎంహెచ్‌వోకు డొంకేశ్వర్ మండల సర్పంచుల వినతి
డొంకేశ్వర్(ఆర్మూర్): మండల కేంద్రంలోని పీహెచ్‌సీని 24గంటల ఆస్పత్రిగా మార్చాలని కోరుతూ డొంకేశ్వర్ మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం డీఎంహెచ్‌వో రాజశ్రీని జిల్లా కేంద్రంలో కలిసి వినతిపత్రం అందజేశారు. పీహెచ్‌సీలో ప్రస్తుతం తొమ్మిది గంటలు మాత్రమే ప్రజల కు వైద్య సేవలు అందుతున్నాయని, సాయంత్రం నాలుగు గంటల తర్వాత సేవలు అందడం లేదని తెలిపారు. సాయంత్రం తర్వాత పాముకాటు, కుక్కకాటు, ఇతర ప్రమాదాలు జరిగితే స్థానిక పీహెచ్‌సీలో వైద్య సేవలు లభించడం లేదన్నారు. 13 గ్రామ పంచాయతీలు కలిసి పీహెచ్‌సీని 24గంటల ఆస్పత్రిగా మార్చాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఫోరం అధ్యక్షులు బట్టు సంజీవ్‌రాజ్, సర్పంచులు సురకంటి రాజారెడ్డి, అల్లారి గంగాధర్, దశరథ్, భూమన్న, మహేశ్ ఉన్నారు.


