● నందిపేట అంగడిలో
తాగునీటికి కటకట
● కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు
నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలో జరుగుతున్న సంతలో సమస్యలు నెలకొన్నాయి. ప్రతి సోమవారం జరిగే సంతకు చుట్టూపక్కలా సుమా రు 60 గ్రామాల నుంచి రైతులు, చిరు వ్యాపారులు ఈ సంతకు వస్తారు. సంతలో కనీసం తాగునీటి, మరుగుదొడ్ల సౌకర్యం కూడ లేకపోవడంతో సంతకు వచ్చే వినియోగదారులు, విక్రయదారులు ఇబ్బందులకు గురువుతున్నారు.
లక్షల్లో ఆదాయం..
తైబజార్ వేలం ద్వారా జీపీకి రూ. లక్షల్లో ఆదా యం సమకూరుతుంది. ఈఏడాది వారాంతపు సంత రూ. 10 లక్షల తొమ్మిది వేలు, రోజు వారి సంత రూ. లక్షా 38 వేలు పలికింది. సంతలో కనీస సదుపాయాలు కల్పించడం లేదు. సంతకు వచ్చే కొనుగోలుదారుల నుంచి విలువైన సెల్‌ఫోన్లు, పర్సులు చోరీకి గురువుతున్నాయి. అసలే ఇరుకు రోడ్డు ఆపై సంతలోకి కార్లు, ఆటోలు తీసుకు రావడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా నెలకొంటుంది. సంతలో సమస్యలతో పాటు దొంగతనాలను, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని వినియోగదారులు, విక్రయదారులు కోరుతున్నారు.
నందిపేటలో జరుగుతున్న సంత (ఫైల్)


