సబ్‌ స్టేషన్‌ కంట్రోల్‌ రూం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సబ్‌ స్టేషన్‌ కంట్రోల్‌ రూం పరిశీలన

Jul 8 2026 1:44 AM | Updated on Jul 8 2026 1:44 AM

బోధన్‌: సబ్‌ స్టేషన్‌ సిబ్బందికి భద్రత ఏది? శీర్షికన ప్రచురితమైన కథనానికి బోధన్‌ విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించారు. బోధన్‌ విద్యుత్‌ డీఈఈ మహ్మద్‌ ముక్తార్‌, టీజీఎన్సీడీసీఎల్‌ నిజామాబాద్‌ కన్‌స్ట్రక్షన్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఈఈ స్వామిలు సాలూర సబ్‌ స్టేషన్‌ను సందర్శించి కంట్రోల్‌ రూం భవనాన్ని పరిశీలించారు. కంట్రోల్‌ రూం రేకుల షెడ్డు భవనానికి మరమ్మతులు చేపట్టేందుకు అంచనా వ్యయాన్ని తయారు చేశారు.ఈ సందర్భంగా డీఈఈ ముక్తార్‌ మాట్లాడుతూ కంట్రోల్‌ రూం ఆవరణలో వర్షం నీరు చేరకుండా గ్రావెల్‌ రోడ్డు నిర్మిస్తామన్నారు. అలాగే కంట్రోల్‌ రూం భవనానికి పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు చేపడుతామని తెలిపారు. ఏఈ కల్యాణ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ యువసేన చేయూత

కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన ముద్దంగుల అశోక్‌ కుటుంబానికి ఉప్లూర్‌లోని వైఎస్‌ జగన్‌ యువసేన చేయూత అందించింది. అశోక్‌ రెండు వారాల క్రితం జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పెద్దను కో ల్పోవడంతో వైఎస్‌ జగన్‌ యువసేన సభ్యులు మంగళవారం వారింటికి వెళ్లి 50 కిలోల బియ్యం సంచి, రూ. 10 వేల నగదును అందజేశారు. యువసేన సభ్యులు అవారి సుభాష్‌, అఖిలేష్‌, అనోజ్‌, అరవింద్‌, హర్షిత్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement