కొనసాగుతోంది సర్‌ | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతోంది సర్‌

Jul 6 2026 1:22 AM | Updated on Jul 6 2026 1:22 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

జిల్లాలో వేగవంతమవుతున్న ప్రక్రియ

ఇంటింటికీ వెళ్తున్న బీఎల్‌వోలు, అధికారులు

3వ తేదీ నాటికి ఏడు మండలాల్లో ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తి

ఆ కల్లు తాగితే అంతే...

రసాయనాలతో తయారైన కృత్రిమ కల్లు ప్రజల ప్రాణాలను తీస్తోంది. మత్తుకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

సోమవారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2026

– 8లో u

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలో సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈనెల 3వ తేదీ నాటికి ఏడు మండలాల్లో ఎన్యుమరేషన్‌ ఫామ్‌ల పంపిణీ వందశాతం, 22 మండలాల్లో సుమారు 99 శాతం పూర్తయ్యింది. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, గ్రామాల్లో బీఎల్‌వోలు, రెవెన్యూ అధికారులు ఇంటింటికీ వెళ్తూ అవగాహన కల్పిస్తున్నారు.

అవగాహన లేక ఇక్కట్లు

ఎన్యుమరేషన్‌ ఫామ్‌లను నింపడంపై అవగాహన లేక చాలామంది ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పాత ఓటర్ల జాబితా నుంచి కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను తీసుకొని ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారి వివరాలను ఏమాత్రం తప్పు లేకుండా పూర్తి చేయాల్సి ఉంది. దీనికి గుర్తింపు కార్డులను కూడా జత చేయాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో బీఎల్‌వోలు ఫారాలు తిరిగి తీసుకునేందుకు ఇంటింటికి వెళ్తుండగా పూరించినవి ఉండడంతో లేదు. దీంతో వారే వివరాలను సేకరించి ఫామ్‌లను నింపుతున్నారు. ఈ ప్రక్రియ మరింత సమయం తీసుకుని అవకాశం ఉంది.

గడువులోగా పూర్తి చేయాల్సిందే..

ఎన్యుమరేషన్‌ ప్రక్రియను ఈనెల 24వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, 1,565 మంది బీఎల్‌వోలు, 160 మంది సూపర్‌వైజర్లు, తహసీల్దార్లు పని చేస్తున్నారు. ఆదివారం వరకు మాక్లూర్‌, డొంకేశ్వర్‌, ధర్పల్లి, నవీపేట, రెంజల్‌, చందూర్‌, మోపాల్‌, జక్రాన్‌పల్లి, ముప్కాల్‌, వర్ని మండలాల్లో వందశాతం ఫామ్‌ల పంపిణీ పూర్తయ్యింది. ఈనెల 31వ తేదీన ముసాయిదా జాబితాను ప్రచురించి, ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్‌ 1వ తేదీన విడుదల చేస్తారు.

జిల్లాలో ఈనెల 3 నాటికి ‘సర్‌’ ఇలా..

జిల్లాలో సర్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్యుమరేషన్‌ ఫామ్‌ల పంపిణీ పూర్తయినా.. వాటిని పూరించడంపై ఓటర్లకు అవగాహన లేక నెమ్మదిస్తోంది. బీఎల్‌వోలే వివరాలు సేకరించి ఫామ్‌లు నింపాల్సిన పరిస్థితి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement