భూభారతితో రైతులకు ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

భూభారతితో రైతులకు ప్రయోజనం

Mar 12 2026 7:44 AM | Updated on Mar 12 2026 7:44 AM

తెయూ(డిచ్‌పల్లి): భూభారతి రైతులకు ప్రయో జనం చేకూరుస్తుందని అడ్వకేట్‌ సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. భూమి రికార్డుల డిజిటలైజేషన్‌, భూ వివాదాల పరిష్కారం, భూమి రిజిస్ట్రేషన్‌ విధానంలో పారదర్శకత పెంపు వంటి అంశాల్లో భూ భా రతి చట్టం ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో ‘లాండ్‌ గవర్నెస్‌ ఇన్‌ తెలంగాణ స్టేట్‌: భూభారతి యాక్ట్‌ –2025’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సునీల్‌ కుమార్‌ ముఖ్యవక్తగా హాజరై, మాట్లాడారు. రైతులు భూమి పత్రాలను సరిచూసుకోవడం, చట్టపరమైన అవగాహన కలిగి ఉండడం ద్వారా మోసాలను నివారించవచ్చన్నారు. చీఫ్‌ ప్యాట్రన్‌గా తెయూ వీసీ యాదగిరిరావు, ప్యాట్రన్‌గా రిజిస్ట్రార్‌ యాదగిరి, కో–ప్యాట్రన్‌గా డీన్‌ శ్రీనివాస్‌ వ్యవహరించారు. లా కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ ప్రసన్నరాణి, అధ్యాపకులు స్రవంతి, జెట్లింగ్‌ ఎల్లోసా, నాగజ్యోతి, లా విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement