488 పోలింగ్‌ కేంద్రాలు.. 3.48 లక్షల ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

488 పోలింగ్‌ కేంద్రాలు.. 3.48 లక్షల ఓటర్లు

Feb 11 2026 7:20 AM | Updated on Feb 11 2026 7:20 AM

488 పోలింగ్‌ కేంద్రాలు.. 3.48 లక్షల ఓటర్లు

488 పోలింగ్‌ కేంద్రాలు.. 3.48 లక్షల ఓటర్లు

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 60 డివిజన్లలో 350 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట ర్లకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. మంగళవారం నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్టిబ్యూషన్‌ కేంద్రాల నుంచి సిబ్బంది సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

488 పోలింగ్‌ కేంద్రాలు..

మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 134 ప్రాంతాలలో 488 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 3,48,051 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 1,67,461 పురుషులు, 1,80,546 సీ్త్రలు, 44 ఇతరులు ఉన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని వెంట తెచ్చుకుని ఓటు వేయవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికలకు అవసరమైన 488 బ్యాలెట్‌ బాక్సులతోపాటు మరో 20 శాతం అదనంగా అందుబాటులో ఉంచారు. మున్సిపల్‌ పోలింగ్‌ నిర్వహణ కోసం 60 డివిజన్లకు పీవోలు, ఏపీవోలు, ఓపీవోలను కలుపుకొని మొత్తం 2,930 మంది విధులు నిర్వర్తించనున్నారు.

ఏర్పాట్లు పూర్తి..

488 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రధానంగా ర్యాంప్‌, టాయిలెట్స్‌, విద్యుత్‌ సరఫరా, నీటి వసతి, వీల్‌చైర్స్‌ తదితర సదుపాయాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు. నగరంలోని ఫులాంగ్‌ వ ద్దగల టీటీడీ కల్యాణమండపం, ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌ను మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. నగరంలో 89 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికలు సజావుగా సాగేలా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద సాయుధ బలగాలను మోహరిస్తున్నారు.

సమస్యాత్మక కేంద్రాల వద్ద

అదనపు భద్రత బలగాలు

పోలింగ్‌ సామగ్రితో కేంద్రాలకు

చేరుకున్న సిబ్బంది

నగరంలో పోలింగ్‌కు సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement