జాతీయ సమైక్యతా శిబిరానికి తెయూ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

జాతీయ సమైక్యతా శిబిరానికి తెయూ విద్యార్థులు

Feb 11 2026 7:20 AM | Updated on Feb 11 2026 7:20 AM

జాతీయ సమైక్యతా శిబిరానికి తెయూ విద్యార్థులు

జాతీయ సమైక్యతా శిబిరానికి తెయూ విద్యార్థులు

జాతీయ సమైక్యతా శిబిరానికి తెయూ విద్యార్థులు పీజీ పరీక్షల రీ షెడ్యూల్‌ అనుమతి లేకుండా మొరం తరలింపు గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచాలి

తెయూ(డిచ్‌పల్లి): కేంద్ర యువజన సర్వీసు లు, క్రీడా వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగనున్న జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపికై న తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు మంగళవారం వెళ్లినట్లు కోఆర్డినేటర్‌ ప్రొఫెస ర్‌ అపర్ణ తెలిపారు. పుణే ఎన్‌ఎస్‌ఎస్‌ రీజినల్‌ డైరెక్టర్‌ పరిధిలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో ఈ నెల 11 నుంచి 17 వరకు శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. బృందానికి కంటింజెంట్‌ లీడర్‌గా జీజీ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ దస్తప్ప వ్యవహరిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రత్యేక శీతాకాల శిబిరంలో వారం రోజులపాటు ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు వివిధ పోటీల లో పాల్గొని జాతీయ సమైక్యతపై చక్కటి అవగాహన పెంపొందించుకోవాలని వీసీ యాదగిరిరావు,రిజిస్ట్రార్‌ యాదగిరి సూచించారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 17 నుంచి ప్రారంభం కావాల్సిన పీజీ మొదటి సెమిస్టర్‌, పీజీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల మొదటి సెమిస్టర్‌, ఐఎంబీఏ 7వ సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 2వ తేదీ నుంచి జరుగుతాయని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ కే.సంపత్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సి టీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

పారిశుద్ధ్య కార్మికుడికి ఫిట్స్‌

బోధన్‌ టౌన్‌(బోధన్‌): బోధన్‌ బల్దియాలోని పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుడు శివకుమార్‌ విజయ మేరీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో విధులు నిర్వహిస్తుండగా ఫిట్స్‌ వచ్చింది. గమనించిన తోటి సిబ్బంది, సంబంధిత అధికారి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం శివ ఆరోగ్యం మెరుగుపడటంతో ఇంటికి తీసుకెళ్లారు.

ఒకరిపై కేసు నమోదు

రెంజల్‌(బోధన్‌): అనుమతి లేకుండా మొరం తరలించిన వ్యక్తిపై కేసు నమోదైంది. మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన జిన్న సాయిలు సోమవారం రాత్రి అనుమతి లేకుండా గుట్ట నుంచి సుమారు 250 ట్రాక్టర్ల మొరం తరలించినట్లు స్థానికులు తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం ఎమ్మారై ఫహీం గ్రామానికి చేరుకొని విచారించారు. దీంతో సదరు వ్యక్తిపై చర్యల కోసం తహసీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై చంద్రమోహన్‌ కేసు నమోదు చేశారు.

సుభాష్‌నగర్‌: రంజాన్‌ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని వంట గ్యాస్‌ సిలిండర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ గ్యాస్‌ ఏజెన్సీల డీలర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. సరిపడా వంట గ్యాస్‌ సిలిండర్లు తెప్పించుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్‌ రెడ్డి, అధికారులు అరవింద్‌ రెడ్డి, రవి రాథోడ్‌, ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement