పటిష్ట భద్రత కల్పించాలి
ఆర్మూర్/కమ్మర్ పల్లి(భీవ్‌ుగల్)/ బోధన్ టౌన్: మున్సిపల్ పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సీపీ సాయిచైతన్య అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్డులో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను ఆయన మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. 13న ఓట్ల లెక్కింపు సంద ర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జర గకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌ డ్, పోలీసు అధికారులు ఉన్నారు. అనంతరం భీమ్‌గల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రా లను సీపీ సాయి చైతన్య మంగళవారం సందర్శించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి , సీటీసీ ఏసీ పీ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, సీఐ పొన్నం సత్యనారాయణ, ఎస్సైలు తిరుపతి, అనిల్, రాము, రాజేశ్వర్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, తహసీల్దార్ షబీర్ పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని ధ్యాకం గల్లీ, శక్కర్‌నగర్‌లోని బస్తీ దవాఖాన, గ్రామ చావిడీ, మధుమలాంఛ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సీపీ సాయిచైతన్య పరిశీలించారు. సీపీ వెంట సీఐడీ ఏసీపీ రఘునాథ్, సీఐలు వెంకట నారా యణ, కృష్ణ, రమేష్, ఎస్సైలు సిబ్బంది ఉన్నారు.
సీపీ సాయిచైతన్య


