10, 11న మార్కెట్‌లో కొనుగోళ్ల నిలిపివేత
సుభాష్‌నగర్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈనెల 10, 11 తేదీల్లో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో టెండర్లు (కొనుగోళ్లు) నిలిపేస్తున్నట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ మర్చంట్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేవలం తూకాలు మాత్రమే జరుగుతాయన్నారు. 12వ తేదీ నుంచి మార్కెట్‌యార్డులో యథావిధిగా వ్యాపార కార్యకలాపాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించి మార్కెట్ కమిటీకి సహకరించాలని ఆమె కోరారు.


