ఎన్నికల సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి

Feb 10 2026 7:20 AM | Updated on Feb 10 2026 7:20 AM

ఎన్నికల సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి

ఎన్నికల సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, పోలింగ్‌

కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌

ఆర్మూర్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి అవరసమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. ఆర్మూర్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను ఆమె సోమవారం సందర్శించారు. పోలింగ్‌ సామగ్రి, బ్యాలెట్‌ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ హాళ్లను సైతం పరిశీలించిన కలెక్టర్‌, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, ఒక్క సెకను కూడా విద్యుత్‌ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు. అనంతరం మామిడిపల్లిలోని ప్ర భుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో ఏ ర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో తప్పిదాలకు తావిస్తే కఠిన చర్య లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియా, ఆర్వో శ్రీనివాస్‌ ఉన్నారు.

మూడో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి..

నిజామాబాద్‌ అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహ ణ ఏర్పాట్లలో భాగంగా జిల్లాలో పోలింగ్‌ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయా ల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎలక్షన్‌ జనరల్‌ అబ్జర్వర్‌ సీహెచ్‌ సత్యనారాయణ రెడ్డిల సమక్షంలో ర్యాండమైజేషన్‌ జరిపించారు. ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులను ఆయా పోలింగ్‌కేంద్రాలకు కేటా యించారు. అదనపు కలెక్టర్‌ అంకిత్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement