గరీబోళ్లకు అండగా కాంగ్రెస్‌ పార్టీ | - | Sakshi
Sakshi News home page

గరీబోళ్లకు అండగా కాంగ్రెస్‌ పార్టీ

Feb 10 2026 7:20 AM | Updated on Feb 10 2026 7:20 AM

గరీబో

గరీబోళ్లకు అండగా కాంగ్రెస్‌ పార్టీ

ఆర్మూర్‌ పట్టణ అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే సాధ్యం

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌

ఆర్మూర్‌: గరీబోళ్లకు అండగా నిలిచేది కాంగ్రెస్‌ పా ర్టీ అని, మున్సిపల్‌ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. పట్టణంలోని అంగడిబజార్‌లో సోమవా రం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఎన్నికల ప్ర చార సభ నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్‌(చిన్న) అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించా రు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డితో, ఓడిపోయిన జీవన్‌రెడ్డితో పట్టణ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కౌన్సిలర్లుగా విజయం సాధి స్తేనే ఆర్మూర్‌ పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుంద న్నారు. మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగరవేసిన ఆరు నెలల్లో మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేస్తామన్నారు.15,16,17,29,35,34 వార్డుల పరిధి లోని కాంగ్రెస్‌ అభ్యర్థులు గోనె లహరి, సవిత, ఏబీ శ్రీదేవి(చిన్న), సడక్‌ వినోద్‌, నర్మె నవీన్‌, భారత్‌ గ్యాస్‌ తిరుమల సుమన్‌లను భారీ మెజారిటీతో గె లిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో నియోజకవర్గం ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సాయిబాబా గౌడ్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు ఉత్కర్ష్‌, అఖిల్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

భీమ్‌గల్‌ను దత్తత తీసుకుంటా..

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన భీమ్‌గల్‌ ప ట్టణాన్ని కాంగ్రెస్‌ పార్టీ దత్తత తీసుకొని, అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. భీమ్‌గల్‌లో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఈరవ త్రి అనిల్‌, మానాల మోహన్‌రెడ్డి, అన్వేశ్‌ రెడ్డితో క లసి ప్రచారం నిర్వహించారు. నంది గల్లీ వద్ద ఆయ న మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌లా గాలి మా టలు చెప్పే సంప్రదాయం తమది కాదని, ఇప్పటికే రూ. 24 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తు చేశా రు. భీమ్‌గల్‌ ప్రాంత వ్యక్తిగా, ఈ ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల కోసం రూ. 6 కో ట్ల విలువైన తన సొంత భూమిని ప్రభుత్వానికి ఇ చ్చానన్నారు. వంద పడకల ఆస్పత్రికి రూ. 5 కోట్లు మంజూరు చేసి మూడు నెలల్లో పూర్తిచేస్తామన్నా రు. రూ. 365 కోట్ల నిధులతో ధర్మపురి నుంచి కొండగట్టు, వేములవాడ, మీదుగా లింబాద్రిగుట్ట వర కు, అక్కడి నుంచి భీమ్‌గల్‌ మీదుగా బాసర వరకు పెద్ద కారిడార్‌ నిర్మించనున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ అభ్యర్థులను 12 వార్డులలో గెలిపించి ఈ గడ్డను కాంగ్రెస్‌ అడ్డగా నిలపాలని కోరా రు. డీసీసీ అధ్యక్షుడు నగేష్‌ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌ కుమార్‌, ఎన్నికల ఇన్‌చార్జి గాలి అనిల్‌ కుమార్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి బి. వేణుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

గరీబోళ్లకు అండగా కాంగ్రెస్‌ పార్టీ 1
1/1

గరీబోళ్లకు అండగా కాంగ్రెస్‌ పార్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement