సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

సమయపాలన పాటించాలి

Feb 10 2026 7:20 AM | Updated on Feb 10 2026 7:20 AM

సమయపాలన పాటించాలి

సమయపాలన పాటించాలి

సమయపాలన పాటించాలి

డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ శ్రీ

సుభాష్‌నగర్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ శ్రీ తెలిపారు. నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఆమె సోమవారం సమీక్షించారు. ఆశా కార్యకర్తల ద్వారా కుష్టు నియంత్రణ కోసం చేపట్టిన ఎల్‌సీడీసీ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. క్షయ నియంత్రణలో భాగంగా క్షేత్రస్థాయిలో ఎక్స్‌ రే పరీక్షలు చేయాలని తెలిపారు. మాతృ మరణాలు, శిశువులు, చిన్నారుల మరణాలను జరగకుండా చూడాలన్నారు. గర్భిణులకు నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న గర్భిణుల జాబితాలను సేకరించి ఫాలో అప్‌ చేయాలని పేర్కొన్నారు. అర్హులైన శిశువులకు 100 శాతం వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలన్నారు. జీవన శైలి వ్యాధుల నియంత్రణలో మెడికల్‌ ఆఫీసర్‌ లాగిన్‌లో పెండింగ్‌ లేకుండా ఎంట్రీ చేయాలని, పాలియేటీవ్‌ కేర్‌లో ఓపీ, ఐపీ, గృహాల వద్ద చికిత్స పొందిన వారి పేర్లతో కూడిన జాబితాను తయారు చేయాలని తెలిపారు. రాష్ట్రీ య బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా రిఫరల్‌ చిల్డ్రన్స్‌ జాబితా సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. సమీక్షలో జిల్లా టీకాల అధికారి డాక్టర్‌ అశోక్‌, డీటీసీవో డాక్టర్‌ దేవి నాగేశ్వరి, జిల్లా ఉప వైద్యాధికారులు రవీందర్‌, సమత, అశ్వినీ, ప్రోగ్రాం అధికారులు శ్వేత, వెంకన్న, సుప్రియ, సామ్రాట్‌, శిఖర, చైతన్య, శ్రావ్య, పీఎంవో రూప, డీహెచ్‌ఈ ఘన్‌పూర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement