కాంగ్రెస్ బకాసురుల పార్టీ
సుభాష్‌నగర్: కాంగ్రెస్ బకాసూరుల పార్టీ అని, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను అప్పగిస్తే లూటీ చేయడం ఖాయమని ఎంపీ అర్వింద్ ధర్మ పురి ఆరోపించారు. నగరంలో సోమవారం బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా పూసలగల్లిలో కార్నర్ మీటింగ్‌లో అర్వింద్ మాట్లాడుతూ.. ముస్లింల కోసం రేవంత్‌రెడ్డి చేస్తున్న ఊడిగంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంతుద్దీన్ కాదని.. రేవంత్ బేగం అని అభివర్ణించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా అమ్ముకున్నారని, ఎంఐఎంకు కాంగ్రెస్, సీ ఎం బ్రోకర్‌గా మారాడని విమర్శించారు. నిజామా బాద్‌లో వ్యక్తికి ఓటు వేయడం లేదని.. వ్యవస్థకు ఓటేయాలని, ఆ వ్యవస్థ బీజేపీ అని తెలిపారు. అవి నీతి రహిత పాలన కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూ ర్యనారాయణ మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో నీ తికి, అవినీతికి, ధర్మానికి, అధర్మానికి మధ్య జరు గుతున్న ఎన్నికలు అని పేర్కొన్నారు. ప్రజలు ఈ ఎ న్నికల్లో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే ఫలితాలు ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. సమావేశంలో అభ్యర్థులు, బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
● వ్యక్తిత్వాన్ని అమ్ముకున్న సీఎం
● ఎంపీ అర్వింద్ ధర్మపురి


