‘ఇందూరు’ బీజేపీతోనే సాధ్యం | - | Sakshi
Sakshi News home page

‘ఇందూరు’ బీజేపీతోనే సాధ్యం

Feb 9 2026 8:09 AM | Updated on Feb 9 2026 8:09 AM

‘ఇందూరు’ బీజేపీతోనే సాధ్యం

‘ఇందూరు’ బీజేపీతోనే సాధ్యం

సుభాష్‌నగర్‌: కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగిరిన వెంటనే నిజామాబాద్‌ పేరును ఇందూరుగా మారుస్తామని, మొదటి సర్వసభ్య సమావేశంలోనే తీర్మానం చేస్తామని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని కంఠేశ్వర్‌ టీ కార్నర్‌ చౌరస్తాలో 19 డివిజన్‌ అభ్యర్థి నాగోళ్ల లక్ష్మీనారాయణ, 20వ డివిజన్‌ అభ్యర్థి న్యాలం సునీత రాజు, 43వ డివిజన్‌ అభ్యర్థి సోమ లింగం, వినా యక్‌నగర్‌లోని హనుమాన్‌ జంక్షన్‌లో ఆరో డివిజన్‌ అభ్యర్థి గోపిడి స్రవంతిరెడ్డి, 22వ డివిజన్‌ అభ్యర్థి పులగం సాయి వైష్ణవి సుధా, 23వ అభ్యర్థి మేకల విజయ మల్లేశ్‌యాదవ్‌ తరఫున ఎంపీ అర్వింద్‌ ధర్మపురి, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, మా జీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, జిల్లా ఇన్‌చార్జి కాంతారావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ.. రెండేళ్లలో నిజామాబాద్‌ మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో.. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ని ధులు ఇచ్చిందో చర్చకు సిద్ధమా అని పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సవాల్‌ విసిరారు. కాంగ్రె స్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని, అన్ని పార్టీలు ఒకవైపు ఉంటే.. బీజేపీ ఒకవైపు ఉందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ మూడోస్థానానికే పరిమితం కానుందని ఎద్దేవా చేశారు.

ప్రతి నెలా అయోధ్యకు

మేయర్‌గా బీజేపీ గెలిస్తే ప్రతినెలా ఒక రైలులో ఉచితంగా అయోధ్య దర్శనానికి ప్రజలను తీసుకెళ్తారని, అందుకు ఎంపీ అర్వింద్‌ సహకరిస్తారని రఘునందన్‌రావు ప్రకటించారు. ఎక్కడ చూసినా బీజేపీకి ప్రజలు నీరాజనం పలుకుతున్నారని, కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేస్తారన్న విశ్వాసం తనకు ఉందన్నారు. కాంగ్రెస్‌ హటావో.. ఇందూరు బచావో అని నినదించారు.

కులాల పేరుతో హిందువుల విభజన

నగరంలో కులాల పేరుతో హిందువుల విభజనకు కాంగ్రెస్‌ కుట్రలు పన్నుతోందని, మనమంతా ఐక్యంగా ఉండి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ అర్వింద్‌ అన్నారు. కౌన్సిలర్‌గా గెలవని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా స్మార్ట్‌సిటీ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపించి.. ఆ తర్వాత మాట్లాడాలని హితవుపలికారు. జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్ట్‌కు స్థలం అప్పగిస్తే.. ఏడాదిలో విమానాన్ని దింపుతానని సవాల్‌ విసిరారు. మన ఇందూరు.. మన మేయర్‌ నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు.

మొదటి సర్వసభ్య సమావేశంలోనే

పేరు మార్పుపై తీర్మానం చేస్తాం

మేయర్‌ ప్రమాణస్వీకారానికి

ప్రధాని మోదీ వస్తారు

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement