వాలీబాల్‌లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
● రాష్ట్రస్థాయి పోటీల్లో విన్నర్‌గా జిల్లా
బాలికల జట్టు, రన్నర్‌గా బాలుర జట్టు
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు విజేతగా నిలువగా, రన్నర్‌గా మహబూబ్‌నగర్, తృతీయ స్థానంలో కరీంనగర్, నాల్గో స్థానంలో మెదక్ జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో వరంగల్ జట్టు విజేతగా నిలువగా, రన్నర్‌గా నిజామాబాద్, తృతీయ స్థానంలో ఖమ్మం, నాల్గో స్థానంలో రంగారెడ్డి జట్లు నిలిచాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీబీ సీఐ గడ్డం నగేశ్ విజేతల కు బహుమతులు అందజేశారు. రాష్ట్ర వాలీ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జల రమేశ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్‌రెడ్డి, ట్రెజరర్ శ్రీకృష్ణ, వాలీబా ల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్‌గౌ డ్, ట్రెజరర్ ఏనుగు గంగారెడ్డి పాల్గొన్నారు.


