కొన్ని గంటలే.. | - | Sakshi
Sakshi News home page

కొన్ని గంటలే..

Feb 9 2026 7:21 AM | Updated on Feb 9 2026 7:21 AM

కొన్న

కొన్ని గంటలే..

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

పరిస్థితులను బట్టి గేమ్‌ ఛేంజ్‌

చేసుకునేందుకు అభ్యర్థుల పాట్లు

తుది దశ ఎత్తుగడలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళికలు

ఎరుపెక్కిన ఇస్రోజివాడి

గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టు అగ్రనేత లోకేటి చందర్‌ అంత్యక్రియలు ఇస్రోజివాడిలో పూర్తయ్యాయి.

సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

– 8లో u

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పురపాలక ఎన్నికలకు సంబంధించి నేటితో ప్రచారం పరిసమాప్తం కానుంది. సోమవారం సాయంత్రం 5గంటలకు మైకులు బంద్‌ చేయాల్సిందే. అయితే నామినేషన్ల ప్రక్రియతోపాటు ప్రచారానికి సైతం చాలా తక్కువ స మయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో ఉరుకులు పరుగుల మీద ప్రచార పర్వం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక ప్రచారానికి కొన్ని గంటలు మాత్రమే సమయం మిగలడంతో ‘సమయం లేదు మిత్రమా..’ అంటూ పరుగెత్తుతూ, తమ అనుచరులను పరుగెత్తిస్తున్నారు. నేడు అన్ని డివిజన్‌లు, వా ర్డుల్లో భారీ ర్యాలీలకు ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పరిస్థితులను బ ట్టి గేమ్‌ ఛేంజ్‌ చేసుకునే దిశగా అప్పటికప్పుడు ప్ర ణాళికలు రచించుకునేందుకు సిద్ధ మవుతున్నారు. కీలకమైన తుది దశ ఎత్తుగడలను కచ్చితమైన రీతిలో అమలు చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. నేటి సాయంత్రం నుంచి ఓటర్లకు డబ్బులు పంచేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

నువ్వా – నేనా

నిజామాబాద్‌ నగరంలో మేయర్‌ పీఠం కోసం బీ జేపీ, కాంగ్రెస్‌ మధ్య నువ్వా నేనా అనేస్థాయిలో పో రు నడుస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ కింగ్‌ మేకర్‌ అయిన ఎంఐఎం మరోసారి కింగ్‌ మేకర్‌ అ వుతుందా అనేది చూడాల్సి ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉన్నప్పటికీ తాము సైతం కొన్ని సీట్లు గెలుచుకుంటే కీలక పాత్ర పోషించే అవకాశముంటుందని బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, నాయకు లు లెక్కలు వేసుకుంటున్నారు. పరిస్థితులను చూ స్తుంటే ఒకరిద్దరు స్వతంత్రులు సైతం గెలుపొందే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు తప్పవనే చర్చ జరుగుతోంది. మహేశ్‌గౌడ్‌ వర్సెస్‌ ధర్మపురి అర్వింద్‌ అన్నట్లుగా పోరు నడుస్తోంది.

ఆర్మూర్‌లో పై ‘చేయి’!

ఆర్మూర్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఇప్పటివరకు పైచేయిగా నిలుస్తోంది. 2014 వరకు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఆర్మూర్‌లో గత రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్‌ గెలుపొందింది. మళ్లీ ఈసారి ఆర్మూర్‌లో హస్తం తమ హవాను తిరిగి కొనసాగించే వాతావరణం నెలకొంది.

భీమ్‌గల్‌లో బీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అవకాశం

భీమ్‌గల్‌ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉన్నప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో కొంతమేరకు గులాబీ పార్టీ మెరుగైన స్థితిలోకి వచ్చింది. మంత్రిగా ఉన్న సమయంలో ప్రశాంత్‌రెడ్డి చేసిన అభివృద్ధి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్లస్‌ కానుంది. ప్రతి అభ్యర్థి విషయంలో ప్రశాంత్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇదే అభివృద్ధి చూపడంతో గత ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్‌రెడ్డి సీరియస్‌గా తీసుకోలేదనే చర్చ నడుస్తోంది.

నేటి సాయంత్రానికి ప్రచారం సమాప్తం

బోధన్‌లో హోరాహోరీ

బోధన్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, ఎంఐఎంల మధ్య పోటీ నడుస్తోంది. అయితే పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ బీజేపీ అభ్యర్థులు సైతం పుంజుకుంటున్నారు. అయితే బీఆర్‌ఎస్‌ అంతర్గతంగా ఎంఐఎంకు సహకరిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీంతో ఇక్కడ హోరాహోరీ నెలకొంది. ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి వ్యూహాలకు పదును పెడుతున్నారు.

బయటి వ్యక్తులు ఉండొద్దు: సీపీ

నిజామాబాద్‌ అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తరువాత బయటి వ్యక్తులు ఉండొద్దని సీపీ సా యిచైతన్య ఒక ప్రకటనలో సూచించారు. బయ టి వ్యక్తులు ఉంటే చర్యలు తీసుకుంటామని, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రచార సిబ్బంది తదితరులు తప్ప నిసరిగా వెనక్కి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.

ప్రచారం నిషేధం: కలెక్టర్‌

నిజామాబాద్‌ అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్ర చారంపై సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. 11వ తేదీన పోలింగ్‌ ముగిసే వరకు మద్యం, కల్లు దుకాణాలను మూసివేయించాలని అధికారుల కు సూచించారు. 13న కౌంటింగ్‌ పూర్తయ్యే వ రకు డ్రైడే అమలులో ఉంటుందన్నారు.

కొన్ని గంటలే..1
1/2

కొన్ని గంటలే..

కొన్ని గంటలే..2
2/2

కొన్ని గంటలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement