జిల్లా అభివృద్ధికి పూచీ నాది
నిజామాబాద్ రూరల్: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పూచీ తనదేనని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మవీధి చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ప్రజలకు అండగా ఉన్నారని, ఏది అవసరమున్నా అది తెచ్చిచ్చే బాధ్యత తనదేనని, కాంగ్రెస్‌ను గెలి పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో అర్హులందరికీ కార్డులు ఇచ్చామన్నారు. జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రూ.60కోట్ల నిధులు ఇచ్చామని గుర్తుచేశారు. అలా గే టెంపుల్ కారిడార్ రోడ్లకు రూ.650 కోట్లు మంజూరు చేశామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.
దేవుడి పేరుతో రాజకీయాలు
బీజేపీ నాయకులు, ఎంపీ అర్వింద్ దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ సిటీ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే అర్వింద్‌కు పని చేసే ముఖం ఉందా అని విమర్శించారు. పనిచేసే వారిని గెలిపించుకోవాలన్నారు. దేశ ప్రధాని మోదీ గొప్ప లు చెప్పే గుజరాత్ రాష్ట్రంలో లో సన్న బియ్యం ఇవ్వడం లేదన్నారు. అద్దాలు పెట్టుకొని చేతులూపి తే రాజకీయం కాదని, తిడితే రాజకీయ నాయకుడా అని ఎద్దేవా చేశారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ , ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నాయకులు కవితారెడ్డి, రాంభూపాల్, రాము, ప్రమోద్‌గౌడ్, లవంగం ప్రమోద్, అంతిరెడ్డి స్వేతవిజయ్‌పాల్‌రెడ్డి, సకినాల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం అండగా ఉన్నారు..
ఏ అవసరమున్నా తెచ్చే బాధ్యత నాదే..
రూ.60 కోట్ల నిధులు ఇచ్చాం
టెంపుల్ కారిడార్ రోడ్లకు
రూ.650 కోట్లు మంజూరు చేశాం
దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే అర్వింద్‌కు పని చేసే ముఖం ఉందా..
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్


