రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే..
నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ పార్టీ జిల్లా అధ్యక్షు డు జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కా ర్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మా ట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఆందోళన క లిగించేలా, తెలంగాణ సమాజాన్ని గాయపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని, తెలంగాణ జాతిపిత కేసీఆరేనని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రస్థాయి పోలీస్ ఉన్నతాధికారులు కొందరు విపక్ష నేతలను హింసిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ ఉన్నతాధికారి సజ్జనార్ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


