లక్షల హెక్టార్లకు నీరందించిన ఘనత కాంగ్రెస్‌ది | - | Sakshi
Sakshi News home page

లక్షల హెక్టార్లకు నీరందించిన ఘనత కాంగ్రెస్‌ది

Feb 8 2026 3:59 AM | Updated on Feb 8 2026 3:59 AM

లక్షల హెక్టార్లకు నీరందించిన ఘనత కాంగ్రెస్‌ది

లక్షల హెక్టార్లకు నీరందించిన ఘనత కాంగ్రెస్‌ది

దేశంలో ఎక్కడా లేనివిధంగా

ప్రజలకు సన్నబియ్యం

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): రాష్ట్రంలో లక్షల హెక్టార్లలో సాగుకు నీరందించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. భీమ్‌గల్‌ పట్టణంలోని సహస్ర కన్వెన్షన్‌లో ఖనిజాభివృద్ధి శాఖ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌, కో ఆపరేటివ్‌ యూనియన్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డితో కలిసి మంత్రి మీడియా తో శనివారం మాట్లాడారు. రెండు సంవత్సరాల ప్ర జాపాలనలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తాయని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ హ వా కొనసాగుతోందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అ న్ని వర్గాల ప్రజలు ఒకే రకం బియ్యం తినాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామని, దే శంలోని ప్రజాపంపిణీ వ్యవస్థలో రాష్ట్రం అగ్రగామి గా నిలిచిందన్నారు.

పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో రైతుల పండించిన పంటలను, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి తర్వాత రైతులు పండిస్తున్న పంటలను లెక్కలతో సహా బీఆర్‌ఎస్‌ నాయకులకు వి వరిస్తానన్నారు. భీమ్‌గల్‌ అభివృద్ధికి మంత్రిగా వే ముల ప్రశాంత్‌ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. భీమ్‌గల్‌ మున్సిపాలిటీకి అధిక ప్రాధా న్యం ఇస్తున్నామని, పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, నాయకులు సునీల్‌రెడ్డి, కన్నె సురేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement