భీమ్‌గల్‌.. దంగల్‌ | - | Sakshi
Sakshi News home page

భీమ్‌గల్‌.. దంగల్‌

Feb 8 2026 3:59 AM | Updated on Feb 8 2026 3:59 AM

భీమ్‌

భీమ్‌గల్‌.. దంగల్‌

బల్దియా చైర్మన్‌ పీఠం

ఏ పార్టీకి దక్కుతుందోననే ఆసక్తి

అన్ని పార్టీల హేమాహేమీలది ఒకే నియోజకవర్గం

మోర్తాడ్‌(బాల్కొండ): జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. అభ్యర్థులు ప్రతి ఇళ్లు తడుతూ, వాడవాడలా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే, అందరి చూపు భీమ్‌గల్‌ పురపాలకంపై పడింది. బల్దియాపై ఏ జెండా ఎగురుతుందోననే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన హేమాహేమీ నాయకులు ఇక్కడి వారే కావడంతో చైర్మన్‌ పీఠం ఎవరికి దక్కుతుందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. 12 వార్డులు ఉన్న ఈ ము న్సిపాలిటీ పరిధిలో 14,057 మంది ఓటర్లు ఉన్నా రు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ది భీమ్‌గల్‌ మండలంలోని రహత్‌నగర్‌. రాష్ట్ర మైనింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌, రాష్ట్ర సహకార సంఘాల అసోసియేషన్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ సుంకెట్‌ అన్వేశ్‌ రెడ్డిలు బాల్కొండ నియోజకవర్గానికి చెందినవారే కావడం విశేషం. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్‌కు చెందినవారు. నిజామాబాద్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి అర్వింద్‌ మూలాలు వేల్పూర్‌లో ఉన్నాయి. కీలక నాయకులు అందరూ బాల్కొండ నియోజకవర్గానికి చెందినవారు కావడంతో భీమ్‌గల్‌ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నా యి. ఇప్పటికే కాంగ్రెస్‌ ని యోజకవర్గ ఇన్‌చార్జీ ము త్యాల సునీల్‌రెడ్డి, ముగ్గు రు కార్పొరేషన్‌ చైర్మన్లు ఆ పార్టీ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం కోసం విశేష కృషి చేస్తున్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీ అర్వింద్‌ సూచనల మేరకు ప్రచారం సాగిస్తున్నారు. కాగా, మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న రెండో ఎన్నికల్లో చైర్మన్‌ పీఠం ఏ పార్టీని వరిస్తుందో చూడాలి.

భీమ్‌గల్‌.. దంగల్‌1
1/1

భీమ్‌గల్‌.. దంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement