కోటగిరి పాలిటెక్నిక్‌లో సృజనా టెక్‌ ఫెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కోటగిరి పాలిటెక్నిక్‌లో సృజనా టెక్‌ ఫెస్ట్‌

Feb 8 2026 3:59 AM | Updated on Feb 8 2026 3:59 AM

కోటగిరి పాలిటెక్నిక్‌లో సృజనా టెక్‌ ఫెస్ట్‌

కోటగిరి పాలిటెక్నిక్‌లో సృజనా టెక్‌ ఫెస్ట్‌

రుద్రూర్‌: కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం ‘సృజనా టెక్‌ ఫెస్ట్‌–2026’ను శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లాలోని నవీపేట, నందిపేట, కోటగిరి, నిజామాబాద్‌ పాలిటెక్నిక్‌లకు చెందిన మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం విద్యార్థులు హాజరయ్యారు. వివిధ సాంకేతిక ప్రదర్శనలు, నమూనాలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. పోటీలకు బాసర ట్రిపుల్‌ఐటీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మహేశ్‌, ట్రాన్స్‌కో ఏఈ బుజ్జిబాబు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కోటగిరి పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రథమ బహుమతి గెలుపొందగా, ప్రిన్సిపల్‌ సుధాకర్‌ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్‌ పి.సోంప్రసాద్‌, గైడ్‌ శ్రీధర్‌, అధ్యాపకులు రమేశ్‌ నాయుడు, రజిని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement