రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
జక్రాన్‌పల్లి: మునిపల్లి గ్రామ శివారులో టాటా సుమో, బైక్‌ను ఢీకొనడంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (41) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబా ద్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్ తొర్లికొండలోని బంధువుల ఇంటికి శుక్రవారం పండుగ నిమిత్తం వచ్చి బైక్‌పై తిరిగి వెళ్తున్నాడు. మునిపల్లి శివారులోని జాతీయ రహదారిపై టాటా సుమో ఎదురుగా వచ్చి ఢీకొనడంతో శ్రీనివాస్ గౌడ్‌కు తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం శ్రీనివాస్‌గౌడ్ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య మంత్రి సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


