తెలుగులో లింగరాజుకు డాక్టరేట్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాల యంలోని తెలుగు అధ్యయన శాఖలో పరిశో ధక విద్యార్థి బి.లింగరాజు డాక్టరేట్ సాధించా రు. ఆచార్య త్రివేణి పర్యవేక్షణలో ‘శ్రీకృష్ణదేవ రాయాంధ్ర భాషానిలయం –సాహిత్య సేవ’ అనే అంశంపై లింగరాజు పరిశోధన పూర్తిచేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. శనివారం తెయూ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాలలో నిర్వహించిన మౌఖిక పరీక్షకు ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖా ధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ వ్యవహరించారు. పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ ఆచార్య కరిమిండ్ల లావణ్య, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య పి.కనకయ్య, పాఠ్యప్రణాళిక సంఘ చైర్మన్ డా.సీహెచ్ లక్ష్మణ చక్రవర్తి,కంట్రోలర్ సంపత్ కుమార్, ప్రిన్సిపల్ జి. రాంబాబు, హాస్టల్స్ చీఫ్ వార్డెన్ కే రవీందర్ రె డ్డితోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ 3, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ 9వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు శనివారం 78 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,977 మంది విద్యార్థులకు 1,899 మంది హాజరుకాగా, 78 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. కేంద్రాలను కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్‌కుమార్, వర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.రాంబాబు తనిఖీ చేశారు.
● టీచర్లకు స్వల్పగాయాలు
ఇందల్‌వాయి: జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆర్మూర్‌కు చెందిన ఉపాధ్యాయులు గాంధారి మండలంలో విధులు నిర్వర్తిస్తున్నారు. విధులు ముగించుకొని తిరిగి ఆర్మూర్ వైపు కారులో వెళ్తుండగా చంద్రాయన్‌పల్లి గ్రామశివారులో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ధనలక్ష్మి, మహేశ్, రాజేశ్, శ్రీధర్ అనే ఉపాధ్యాయులకు స్వల్పగాయాలు కాగా, కారు ధ్వంసమైంది.
తెలుగులో లింగరాజుకు డాక్టరేట్
తెలుగులో లింగరాజుకు డాక్టరేట్


